కనీవిని ఎరుగని రీతిలో రూపాయి పతనం

by సూర్య | Thu, Sep 22, 2022, 10:09 PM

రూపాయి విలువ మరింత పతనమైంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెరిగిన తర్వాత అమెరికా డాలరు మారకంలో రూపాయి భారీగా క్షీణించింది. ప్రస్తుతం డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు కనిష్ఠ స్థాయిలో  80.56 వద్ద నమోదైంది. బుధవారం 79.98 వద్ద ముగిసిన విలువ గురువారం ఉదయం మరింతగా క్షీణించింది. నిన్నటితో పోలిస్తే 73 పైసలు కోల్పోయింది. ఇంకోవైపు గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. 155 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 59301 వద్ద ఉండగా, నిఫ్టీ 17673 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 44 నష్టంలో ఉంది. 


అమెరికా ఫెడెక్స్ రిజర్వ్ రేట్లను మరోసారి పెంచడంతో అమెరికా డాలరు 20 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకొని దూసుకెళ్తుండగా.. ఆసియా కరెన్సీలు మాత్రం క్షీణతలో ఉన్నాయి. విదేశీ మార్కెట్‌లో అమెరికన్ కరెన్సీ బలం, దేశీయ ఈక్విటీలలో స్తబ్ధత, స్థిరమైన ముడి చమురు ధరలు స్థానిక యూనిట్‌పై ప్రభావం చూపాయని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. ఉక్రెయిన్‌తో రష్యా తన యుద్ధాన్ని తీవ్రతరం చేయడం, బీజింగ్-తైవాన్ మధ్య ఉద్రిక్తతలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.


ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడియన్, సింగపూర్, చైనీస్ కరెన్సీలు కూడా రెండేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. అలాగే, బ్రిటిష్ పౌండ్ విలువ 37 సంవత్సరాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. బ్యాంక్ ఆఫ్ జపాన్ సమావేశం కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నందున యెన్ 24 సంవత్సరాల కనిష్ఠ స్థాయికి చేరుకుంది.

Latest News

 
నాపై ప్రజలకి ఉన్న నమ్మకమే నన్ను గెలిపిస్తుంది Sat, May 04, 2024, 03:46 PM
జగన్‌ పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు Sat, May 04, 2024, 03:45 PM
ముస్లింలు కూటమికి ఓటు వేయడమంటే రిజర్వేషన్‌ రద్దుకు అంగీకరించినట్లే Sat, May 04, 2024, 03:44 PM
పొర‌పాటున చంద్ర‌బాబుకు ఓటేస్తే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్లే Sat, May 04, 2024, 03:43 PM
ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎల్లటూరి శ్రీనివాసరాజు Sat, May 04, 2024, 03:37 PM