‘మూన్ లైటింగ్’ను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదు: విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్ జీ

by సూర్య | Thu, Sep 22, 2022, 10:10 PM

విప్రోలో భారీ ఎత్తున్న ఉద్యోగుల ఉధ్వాసన తీవ్ర చర్చాంశనీయంగా మారింది. ఇదిలావుంటే తమ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఇతర పోటీదారు సంస్థల్లో పని చేస్తున్న 300 మంది తమ ఉద్యోగులను తొలగించి విప్రో సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఇలా రెండు కంపెనీల్లో పని చేయడానికి ‘మూన్ లైటింగ్’ అంటారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించేది లేదని విప్రో చైర్మన్ రిష‌ద్ ప్రేమ్‌జీ స్పష్టం చేశారు. 


ఓ కంపెనీలో తమ పని వేళలు ముగిసిన తర్వాత ఖాళీ సమయంలో ఇతర ఉద్యోగాలు చేయడంపై చర్చ జరుగుతున్నప్పటికీ విప్రో చర్యకు గ్లోబల్ టెక్ కంపెనీ ఐబీఎం కూడా మద్దతు తెలిపింది. మూన్ లైటింగ్ ను అనైతికం అని పేర్కొంది. 300 మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత రిషద్.. మూన్ లైటింగ్ గురించి మాట్లాడారు. దీన్ని ఆయన ‘మోసం’ అని అభివర్ణించారు. బుధవారం జరిగిన ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని నొక్కి చెప్పారు.


‘వాస్తవమేమిటంటే, ఈ రోజు విప్రో ఉద్యోగుల్లో కొందరు నేరుగా మా పోటీదారుల్లో ఒకరి కోసం పని చేసే వ్యక్తులు ఉన్నారు.  గత కొన్ని నెలల్లో సరిగ్గా 300 మంది వ్యక్తులను  మేం గుర్తించాం’ అని తెలిపారు. ‘సమగ్రత ఉల్లంఘన’ కారణంగా వారిని సంస్థ నుంచి తొలగించినట్టు ప్రకటించారు. ‘విప్రోలో పని చేసే ఏ ఒక్కరూ మా పోటీదారు సంస్థల్లో పని చేయడానికి వీల్లేదు. ఇతర కంపెనీలు కూడా అదే విధంగా ఆలోచిస్తే.. అలాంటి ఉద్యోగులను గుర్తిస్తాయి’ అని రిషద్ స్పష్టం పేర్కొన్నారు. ఇదిలావుంటే ద్వంద్వ ఉద్యోగానికి అనుమతి లేదని ఇన్ఫోసిస్ ఈ నెల ఆరభంలో తమ ఉద్యోగులకు కఠినమైన మెయిల్ పంపింది. ‘నో టూ టైమింగ్స్, నో - మూన్‌లైటింగ్’ అని తమ సిబ్బందికి స్పష్టం చేసింది. ఈ విషయంపై అంతర్గత సంభాషణకు ‘నో డబుల్ లైఫ్’ అని పేరు పెట్టింది.

Latest News

 
బస్సు బోల్తా.. డ్రైవర్ తో సహా ఆరుగురుకి గాయాలు Thu, Apr 25, 2024, 12:20 PM
వైసిపి టిడిపి నుండి 60 కుటుంబాలు కాంగ్రెస్ లోకి చేరిక Thu, Apr 25, 2024, 12:18 PM
వైసిపి నుండి 10 కుటుంబాలు టిడిపిలోకి చేరుకా Thu, Apr 25, 2024, 12:10 PM
వైఎస్సార్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాగభూషణ Thu, Apr 25, 2024, 12:09 PM
కొనసాగిన నామినేషన్ల పర్వం Thu, Apr 25, 2024, 12:06 PM