ఇకపై వాయిదాలు కూడా ఇవ్వవద్దు...గాలి జనార్థన్ రెడ్డి కేసులో సుప్రీంకోర్ట్ ఆదేశం

by సూర్య | Thu, Sep 22, 2022, 09:48 PM

గాలి జనార్థన్ రెడ్డి కేసులో ఇకపై ఎలాంటి వాయిదాలు ఇవ్వద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గనుల అక్రమ తవ్వకాల కేసులో నిందితుడిగా ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలన్న పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేసు విచారణను వీలయినంతగా జాప్యం చేశారని కోర్టు అభిప్రాయపడింది.


అంతేకాకుండా గాలి జనార్దన్ రెడ్డిపై నమోదైన కేసులను విచారిస్తున్న హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై ఈ నెల 29లోగా విచారణను ముగించాలని ఆదేశించింది. ఇకపై వాయిదాలు కూడా ఇవ్వవద్దని సూచించింది. కేసు విచారణను జాప్యం చేయడానికే డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేశారని కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM