యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్

by సూర్య | Fri, Apr 26, 2024, 07:45 PM

సుమన్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి 'సత్యభామ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తోంది. ఈ సినిమా మే 17న విడుదల కానుంది.


ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ ని కళ్లారా అనే టైటిల్ తో విడుదల చేయగా, యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు.


మేజర్ మరియు గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్క ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఔరుమ్ ఆర్ట్స్ బ్యానర్‌పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
రీ-రిలీజ్‌ తేదీని లాక్ చేసిన 'అపరిచితుడు' Thu, May 09, 2024, 06:46 PM
'మాయావన్‌' టీజర్‌ అవుట్ Thu, May 09, 2024, 06:44 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'కృష్ణమ్మ' Thu, May 09, 2024, 06:42 PM
'థగ్ లైఫ్' లో అశోక్ సెల్వన్? Thu, May 09, 2024, 06:39 PM
విజయ్ దేవరకొండతో తమ తదుపరి చిత్రాన్ని ప్రకటించిన 'పుష్ప 2' నిర్మాతలు Thu, May 09, 2024, 06:37 PM