ముంబైలో ప్రారంభమైన 'కుబేర' కొత్త షెడ్యూల్

by సూర్య | Thu, Apr 25, 2024, 08:51 PM

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు ధనుష్ ఒక స్ట్రెయిట్ తెలుగు చిత్రం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ డ్రామాకి 'కుబేర' అనే టైటిల్ ని లాక్ చేసారు. ముంబైలోని మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున డాన్‌గా కనిపించనున్నట్లు సమచారం. తాజాగా మూవీ మేకర్స్ కుబేర కొత్త షెడ్యూల్ ముంబైలో ప్రారంభమైనట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ ప్రాజెక్ట్‌లో రష్మిక మందన్న మహిళా ప్రధాన పాత్రను పోషించనుంది. అక్కినేని నాగార్జున, జిమ్ సర్భ్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నికేత్ బొమ్మి ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సహకారంతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ యొక్క యూనిట్), సోనాలి నారంగ్ సమర్పణలో ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
ఓపెన్ అయ్యిన 'ప్రతినిధి 2' బుకింగ్స్ Wed, May 08, 2024, 08:45 PM
'టర్బో' మలేషియా రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, May 08, 2024, 08:43 PM
OTT ప్లాట్‌ఫారమ్ ని లాక్ చేసిన 'బైసన్' Wed, May 08, 2024, 08:40 PM
'కుబేర' నుండి నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ కి భారీ స్పందన Wed, May 08, 2024, 08:38 PM
విడుదల తేదీ ని లాక్ చేసిన 'భజే వాయు వేగం' Wed, May 08, 2024, 06:45 PM