బీసీలకి న్యాయం చేసింది సీఎం జగన్ మాత్రమే

by సూర్య | Fri, Apr 26, 2024, 02:12 PM

సామాజిక న్యాయం సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. నెల్లూరు, కందుకూరులో గురువారం అయన పర్యటించారు. రెండు చోట్లా మీడియాతో మాట్లాడుతూ.. బీసీ నాయకులు సిద్ధరామయ్య, స్టాలిన్, నితీష్‌కుమార్‌ ముఖ్యమంత్రులుగా ఉన్న­ప్పటికీ బీసీలకు న్యాయం చేయలే­కపో­యా­రని, కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని కృష్ణయ్య చెప్పారు. బీసీలకు మేలు చేసే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాదిరిగా ధైర్యం చేయలేకపోయారన్నారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టించిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఆంధ్రప్రదేశ్‌వైపు చూస్తున్నారని, ఇక్కడ అమలు చేస్తున్న పథకాలను తమ రాష్ట్రాల్లో కూడా ప్రవేశ­పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతి పేద కుటుంబంలో సభ్యుడిగా మారారని తెలిపారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి పేదలకు మొండిచేయి చూపారని ఎద్దేవా చేశారు. 

Latest News

 
బెళుగుప్ప గ్రామ టీడీపీ కార్యకర్తలతో సమావేశం అయిన అంబికా Wed, May 08, 2024, 03:10 PM
రోగులను పరామర్శించిన అంబికా లక్ష్మి నారాయణ Wed, May 08, 2024, 03:08 PM
అభివృద్ధి చేసి చూపించిన ఘనత టీడీపీ ది: ఎంపీ అభ్యర్థి బి. కె. Wed, May 08, 2024, 03:06 PM
సమస్యాత్మక గ్రామాలలో ఫుట్ పెట్రోలింగ్, గ్రామసభలు Wed, May 08, 2024, 03:04 PM
ప్రాణాంతక వ్యాధులు సోకకుండా చిన్నపిల్లలకు టీకాలువేయించుకోండి Wed, May 08, 2024, 03:02 PM