భార్యపై అవినీతి ఆరోపణలు.. పదవికి స్పెయిన్ ప్రధాని రాజీనామా

by సూర్య | Thu, Apr 25, 2024, 11:32 PM

భార్యపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో స్పెయిన్ ప్రధాన మంత్రి ఫెడ్రో శాంచెజ్ పదవి నుంచి తప్పుకున్నారు. తన భార్య బెగోనా గోమెజ్‌పై అక్రమాస్తుల కూడబెట్టారనే అనుమానంతో కోర్టు విచారణ ప్రారంభించిన తర్వాత రాజీనామా చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ బుధవారం తెలిపారు. ‘నేను ప్రభుత్వానికి నాయకత్వం వహించాలా లేదా నేను ఈ గౌరవాన్ని వదులుకోవాలా అని నిర్ణయించుకోవడానికి నేను కాసేపు ఆలోచించాలి’ అని ఆయన ఇటీవల ఎక్స్‌లో పోస్ట్ చేసిన లేఖలో పేర్కొన్నారు. సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని, అప్పటి వరకు తన షెడ్యూల్‌ను నిలిపివేస్తానని ఆయన తెలిపారు.


బెగోనా గోమెజ్‌పై వచ్చిన నేరారోపణలు, అవినీతిపై దర్యాప్తు ప్రారంభించినట్టు మాడ్రిడ్ న్యాయస్థానం బుధవారం వెల్లడించింది. బెగోన్‌పై మానోస్ లింపియాస్ (క్లీన్ హ్యాండ్స్) అనే అవినీతి వ్యతిరేక గ్రూప్ ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిధులు లేదా కాంట్రాక్టులను పొందిన అనేక ప్రైవేట్ కంపెనీలతో గోమెజ్‌కు ఉన్న సంబంధాలను అధికారులు విచారిస్తున్నారని ఆన్‌లైన్ వార్తా సంస్థ ఎల్ కాన్ఫిడెన్షియల్ నివేదించిన కొద్ది గంటల్లోనే కోర్టు ప్రకటన వెలువడటం గమనార్హం.


ఎయిర్ యూరోపాకు చెందిన స్పానిష్ టూరిజం గ్రూప్ గ్లోబాలియాతో గోమెజ్‌కు ఉన్న సంబంధాలతో ఈ దర్యాప్తు ముడిపడి ఉందని వెబ్‌సైట్ పేర్కొంది. కోవిడ్-19 సంక్షోభంతో విమానరంగం కుదేలైన తర్వాత భారీ బెయిలౌట్ కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న సమయంలో గ్లోబాలియా సీఈఓ జేవియర్ హిడాల్గోతో ఆమె రెండుసార్లు సమావేశమైందని తెలిపింది.ఆ సమయంలో గోమెజ్.. మాండ్రిడ్ ఇన్‌స్టిట్యూటో డీ ఎంప్రెస్‌ (ఐఈ) బిజినెస్ స్కూల్‌తో అనుసంధానమై ఉన్న ఆఫ్రికా సెంటర్‌ ఫౌండేషన్ నడుపుతున్నారు.


ప్రధాని భార్యపై అవినీతికి పాల్పడ్డారని గత కొద్ది రోజులుగా ప్రతిపక్ష పాపులర్ పార్టీ ఆరోపణలు చేస్తూనే ఉంది. అయితే, వీటిని నిరాధార ఆరోపణలు అంటూ శాంచెజ్ కొట్టిపారేశారు. వారి ఆరోపణ అస్తిత్వం లేని వాస్తవాలపై ఆధారపడి ఉందని, అల్ట్రా కన్జర్వేటివ్ మీడియా నేతృత్వంలోని తన భార్యపై వేధింపుల్లో భాగమని ఎదురుదాడి చేశారు. ‘నేను అమాయకుడిని కాదు. బెగోనాపై వారు ఆరోపణలు చేస్తున్నారని నాకు తెలుసు.. ఆమె నా భార్య కాట్టే ఆరోపణలు చేస్తున్నారు.. ఆమె ఏదైనా చట్టవిరుద్ధం చేసినందుకు కాదు.. అది నిజం కాదని వారికి బాగా తెలుసు’ అని శాంచెజ్ గతంలో పేర్కొన్నారు. అయితే, గతేడాది జూన్ 24, జులై 16న బెగోనా.. గ్లోబాలియా సీఈఓ జేవియన్ హిడాల్గోతో సమావేశమయ్యారని, ఆ తర్వాతే ప్రభుత్వం ఉద్ధీపన పథకం ప్రకటించిందని వెల్లడయ్యింది.

Latest News

 
పుచ్చలపల్లి 39వ వర్ధంతి సందర్భంగా నివాళులు Sun, May 19, 2024, 10:13 PM
నోరు జారిన నేత Sun, May 19, 2024, 10:11 PM
రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై స్పందించిన విజయ్ కుమార్ Sun, May 19, 2024, 10:10 PM
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోండి Sun, May 19, 2024, 10:09 PM
రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతాం Sun, May 19, 2024, 10:09 PM