కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు

byసూర్య | Fri, Oct 25, 2024, 10:44 PM

తెలంగాణలో ప్రభుత్వం వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ (వీఏఎస్‌) నియామకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఎల్బీ స్టేడియంలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలు అందించారు. అయితే ఉద్యోగాలు పొందిన వారిలో సగం మంది ఇంకా డ్యూటీలో చేరలేదు. ఉద్యోగానికి సంబంధించిన అపాయింట్‌మెంట్ ఆర్డర్ పొంది దాదాపు రెండు వారాలు గడుస్తున్నా.. చాలా మంది విధుల్లో చేరలేదు. ఉద్యోగాలు పొందిన వారిలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమకు నచ్చిన చోటుకు పోస్టింగ్‌ ఇప్పించాలని పైరవీలు చేస్తున్నారు.


గత ప్రభుత్వ హయంలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ 2022 డిసెంబర్‌లో 185 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. 175 మంది ఎంపికయ్యారు. ఈ నెల 6న ప్రజాపాలనలో కొలువుల పండుగ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్స్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ చేతుల మీదుగా ఉద్యోగ నియామకాల పత్రాలు అందజేశారు. అయితే వారిలో 168 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు రాగా.. ఆప్షన్స్ మేరకు వారు ఎంపిక చేసుకున్న చోట పోస్టింగ్‌ ఇచ్చారు. కానీ గురువారం (అక్టోబర్ 24) వరకు సగం మంది మాత్రమే డ్యూటీలో జాయిన్ అయ్యారు.


మరో 84 మంది విధుల్లో చేరాల్సి ఉంది. అయితే రూరల్ ఏరియాల్లో పోస్టింగులు పొందిన వైరవీలు ప్రారంభించారు. పట్టణాలకు సమీపంలో పోస్టింగ్ మార్పించుకునేందుకు తెలిసిన వారి ద్వారా పైరవీలు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇలా ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి.. పశుసంవర్ధకశాఖ ఉన్నతాధికారులకు తమకు అనుకూలంగా పోస్టింగ్‌లు ఇవ్వాలని ఫోన్లు చేయిస్తున్నారు. కొత్తగా ఉద్యోగాలు పొందిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ప్రారంభ నెల వేతనం రూ. 81,898గా ఉంది. ఇంత భారీ స్థాయిలో జీతాలు ఉన్నా.. ఉద్యోగాల్లో చేరేందుకు విముఖత చూపించటం ఆశ్చర్యం కలిగిస్తుంది.


ఇంకా డ్యూటీలో చేరని వారికి ఫోన్‌ చేసి సమాచారం తీసుకోవాలని పశుసంవర్థశాఖ డైరెక్టర్ అన్ని జిల్లాల పశుసంవర్ధకశాఖ అధికారులను ఆదేశించారు. అయితే ఉద్యోగాలు పొందిన వారికి ఫోన్‌ చేస్తే.. కొందరు ఆరోగ్యం బాగా లేదని చెబుతుండగా.. మరికొందరు తమ వివాహం ఉందని, పీజీ చేస్తున్నానని ఇలా రకరకాల కారణాలు చెప్పినట్లు తెలిసింది. మరో 20 మంది అయితే కనీసం ఫోన్లు కూడా ఎత్తలేదని సమాచారం.



Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM