byసూర్య | Tue, Oct 15, 2024, 04:19 PM
TG: కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి దసరా పండుగ రోజున రాష్ట్ర పక్షి పాలపిట్టను బంధించారు. సంగారెడ్డి పట్టణంలో నిర్వహించిన దసరా వేడుకల్లో ఓ బోనులో పాలపిట్టలను బంధించి.. ప్రజలకు బహిరంగంగా చూపించారు. జగ్గారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు పాలపిట్టలను బంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా వన్యప్రాణులను బంధించడం నేరం అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.