దళిత విద్యార్థిని ఆదుకున్న సుప్రీం కోర్టు

byసూర్య | Tue, Oct 01, 2024, 03:44 PM

యాజమాన్యం విధించిన గడువులోగా ఫీజు కట్టలేకపోయిన ఓ దళిత విద్యార్థిని సుప్రీం కోర్టు ఆదుకుంది. విద్యార్థి ప్రతిభను గుర్తించి తక్షణమే అతడికి సీటు కేటాయించాలని ఐఐటీ ధ‌న్‌బాద్‌కు ఆదేశాలు జారీ చేసింది. ప్రతిభ గల విద్యార్థిని కేవలం ఫీజు విషయంలో సీటుకు దూరం చేయడాన్ని అనుమతించలేమని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా టిటోరా గ్రామానికి చెందిన అతుల్‌కుమార్​కు ఐఐటీ ధన్‌బాద్‌లో సీటు సాధించాడు.
అయితే సీటు ఖాయం చేసేందుకు జూన్‌ 24లోపు రూ.17,500 ఫీజు కట్టాల్సి ఉండగా పేదరికంతో కట్టలేకపోయారు. విద్యార్థి నిస్సహాయతను చూసిన గ్రామస్థులు విరాళాలు వేసుకొని నగదు అందించారు. చివరి రోజు ఫీజు కట్టే క్రమంలో సాంకేతిక కారణాలతో కట్టలేకపోయారు. సీటు కోల్పోవడంతో విద్యార్థి తనకు న్యాయం చేయాలని కోరుతూ జార్ఖండ్, చెన్నై లీగల్ సర్వీసెస్‌ అథారిటీని ఆశ్రయించాడు. ప్రయోజనం లేకపోవడంతో మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించాడు. మద్రాస్‌ హైకోర్టు దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని కోరింది. సోమవారం ఈ పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. విద్యార్థి కేవల ఫీజు కట్టలేని కారణంగా చదువుకు దూరం చేయలేమని సుప్రీం పేర్కొంది. అతడిని అదే బ్యాచ్‌లో చేర్చుకోవాలని, ఈ క్రమంలో ఏ విద్యార్థి అడ్మిషన్​కు భంగం కలగకుండా సూపర్‌ న్యూమరీ సీటు సృష్టించాలని ఐఐటీ ధన్‌బాద్‌ను ఆదేశించింది.


Latest News
 

గుడిహత్నూర్ ఎన్‌హెచ్ 44పై ఘోర రోడ్డుప్రమాదం Tue, Oct 01, 2024, 07:32 PM
ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి Tue, Oct 01, 2024, 07:28 PM
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి Tue, Oct 01, 2024, 07:28 PM
ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాలకు ప్రకటన : మంత్రి పొన్నం ప్రభాకర్‌ Tue, Oct 01, 2024, 07:27 PM
రాజన్నను దర్శించుకున్న దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ Tue, Oct 01, 2024, 07:12 PM