తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు.. ఆమ్రపాలికి కీలక పోస్టింగ్, మంత్రి సతీమణికి కొత్త బాధ్యతలు

byసూర్య | Mon, Jun 24, 2024, 09:55 PM

తెలంగాణలో ఎన్నికల హడావుడి ముగియటంతో సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపడుతున్నారు. ఇటీవల పలువురు ఐఏఎస్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసి జిల్లాలకు కలెక్టర్‌గా నియమించిన ప్రభుత్వం తాజాగా మరోసారి భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. మెుత్తం 44 మంది అధికారులకు స్థాన చలనం కల్పించారు.


పలువురు అధికారులనకు కీలక బాధ్యతలు అప్పగించారు. హెచ్‌ఎండీఏ జాయిండ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఆమ్రపాలిని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమించారు. ప్రస్తుతం ఈ పోస్టింగ్‌లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రాస్‌ను ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా నియమించారు. ఇక ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సతీమణి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్‌కు కొత్త బాధ్యతలు అప్పగించారు. యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న ఆమెను.. దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు.


ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎం బాధ్యతల నుంచి రిజ్వీని తప్పించి.. ఆయనకు కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. కీలమైన జలమండలి ఎండీగా అశోక్ రెడ్డిని, సెర్ఫ్ సీఈవోగా దివ్య, కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సంజయ్ కుమార్, పాఠశాల విద్యాశాఖ డెరెక్టర్‌గా నర్సింహ్మా రెడ్డి, జేఏడీ సెక్రటరీగా సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.



Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM