హైదరాబాద్​లో ఈ ఏడు ప్రాంతాల్లో హీట్ ఐలాండ్స్.. అక్కడ మాడు పగిలిపోయే ఎండలు, కారణమిదే

byసూర్య | Mon, May 06, 2024, 07:55 PM

తెలంగాణలో గతకొద్దిరోజులుగా భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మే తొలి వారంలోనే రికార్డు స్తాయిలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్‌లోనూ సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఎండ వేడికి నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 తర్వాత కాలు బయటపెట్టేందుకు జంకుతున్నారు. మధ్యాహ్నం 12 తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఒకప్పుడు తక్కువ టెంపరేచర్ నమోదయయ్యే హైదరాబాద్.. ప్రస్తుతం రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నగరంలో 'హీట్ ఐలాండ్స్' పుట్టుకొస్తున్నాయని పరిశోధకలు చెబుతున్నారు.


హైదరాబాద్‌కు చెందిన 'హైదరాబాద్ అర్బన్ ల్యాబ్స్’ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన రీసెర్చ్లో హీట్ ఐలాండ్స్ బయటపడ్డాయి. ఈ సంస్థకు చెందిన రీసెర్చర్లు శబరినాథ్, మేఘన.. ఈ ఏడాది మార్చిలో నమోదైన టెంపరేచర్లను లెక్కించి హీట్ఇండెక్స్ను రూపొందించారు. ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచర్స్ (భూఉపరితలం మీద రెండు మూడు మీటర్ల ఎత్తులో నమోదయ్యే ఉష్ణోగ్రతలు) లెక్కించడం ద్వారా ఈ హీట్అర్బన్ ఐలాండ్స్ను గుర్తించారు. ల్యాండ్ శాట్శాటిలైట్ డేటా ఆధారంగా టెంపరేచర్లను లెక్కించి.. గూగుల్ ఎర్త్ఇంజిన్ ద్వారా హీట్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మార్క్ చేశారు.


నగరంలోని ఏడు ప్రాంతాలు మైలార్దేవ్పల్లి, బీఎన్రెడ్డి నగర్, మన్సూరాబాద్, పటాన్చెరు, బండ్లగూడ, గచ్చిబౌలి, హయత్ నగర్ ప్రాంతాలు హీట్ఐలాండ్స్గా మారినట్టు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో టెంపరేచర్లు గరిష్ఠస్థాయిలో నమోదవుతున్నాయని వారు వెల్లడించారు. ఎక్కడ చూసినా కాంక్రీట్మయం కావటం, చెట్లను కొట్టేయటం, పెద్దపెద్ద బిల్డింగులు, పక్కా ఇండ్లు, కాంక్రీట్ రోడ్లు, బీటీ రోడ్లతో సూర్యుడి వేడి ఎక్కువగా వాతావరణంలోకి అబ్సార్బ్ అవుతున్నట్లు గుర్తించారు. ఇండ్లలో వాడుతున్న ఏసీలు, ఫ్రిజ్లతోనూ సర్ఫేస్ టెంపరేచర్లు పెరిగి హీట్ఐలాండ్స్గా మారుతున్నట్లు రీసెర్చ్‌లో వెల్లడైంది. ఈ ప్రాంతాల్లో ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచర్లు 48 నుంచి 49 డిగ్రీలుగా ఉంటున్నట్టు గుర్తించారు. చెట్లను పెంచటం ద్వారా టెంపరేచర్లు తగ్గించవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు.


Latest News
 

మెట్రో ప్రయాణ వేళల్లో మార్పు లేదు Sun, May 19, 2024, 11:06 AM
రోడ్డు నిర్మాణం పనుల ప్రారంభంతో కాలనీ వాసుల హర్షం Sun, May 19, 2024, 10:58 AM
అమ్మవారి జయంతి వేడుకల్లో మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ Sun, May 19, 2024, 10:57 AM
24 గంటల్లో ట్యాంకర్‌ డెలివరీ..! Sun, May 19, 2024, 10:45 AM
మరో 3రోజులు వర్షాలే Sun, May 19, 2024, 10:20 AM