రైతులకు పండగలాంటి వార్త.. వాళ్లందరి అకౌంట్లలోకి డబ్బులు జమ

byసూర్య | Mon, May 06, 2024, 07:48 PM

తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పండగలాంటి వార్త వినిపించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పంట పెట్టుబడి సాయాన్ని రైతులకు అందించింది సర్కారు. రైతు బంధు నిధులను వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసింది. అయితే.. ఎన్నికల కోడ్ ముందు వరకు.. కేవలం 5 ఎకరాలలోపు రైతులకు మాత్రమే నిధులు విడుదల చేసిన రేవంత్ రెడ్డి సర్కార్.. సోమవారం 5 ఎకరాల కంటే ఎక్కువ సాగుభూమి ఉన్న అన్నదాతలకు కూడా నిధులు విడుదల చేశారు. రైతు బంధు కోసం ప్రభుత్వం దాదాపు రూ.2000 కోట్ల నిధులను సమీకరించగా.. ఈ మేరకు రైతుల అకౌంట్లలోకి రైతు బంధు డబ్బును వ్యవసాయ శాఖ జమ చేసింది.


అయితే.. ఎన్నికల వేళ తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన అంశాల్లో ఒకటి రైతు రుణమాఫీ కాగా.. రెండోది రైతు భరోసా పథకం. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పేరుతో అన్నదాతలకు పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.15 వేల చొప్పున ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. రైతుభరోసా పథకానికి సంబంధించిన విధివిధానాలు ఇప్పటికీ పూర్తికాకపోవటంతో.. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకాన్నే రేవంత్ రెడ్డి సర్కారు కూడా కంటిన్యూ చేస్తోంది. కాగా.. ఈ పథకం కింద ఇప్పటి వరకు కేవలం 5 ఎకరాల రైతులకే పెట్టుబడి సాయం అదించగా.. ఇప్పుడు ఆ పైన రైతులకు సాయం అందిస్తోంది.


కాగా.. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు.. కేసీఆర్ నుంచి మొదలు ప్రతిఒక్క నేత రైతుభరోసా విషయంపై రేవంత్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతుబంధు పథకాన్ని ఆపేశారని.. ఐదెకరాల వాళ్లకు మాత్రమే ఇస్తున్నారని.. మిగతా వారికి మొండిచెయ్యి చూపిస్తున్నారంటూ కేసీఆర్ విమర్శించగా.. తొమ్మిదో తారీఖు వరకు రైతులందరి అకౌంట్లలో డబ్బు జమ చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన మాట మేరకు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు నిధులు విడుదల చేసి.. రైతుల అకౌంట్లలో డబ్బు జమ చేసింది.


Latest News
 

మెట్రో ప్రయాణ వేళల్లో మార్పు లేదు Sun, May 19, 2024, 11:06 AM
రోడ్డు నిర్మాణం పనుల ప్రారంభంతో కాలనీ వాసుల హర్షం Sun, May 19, 2024, 10:58 AM
అమ్మవారి జయంతి వేడుకల్లో మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ Sun, May 19, 2024, 10:57 AM
24 గంటల్లో ట్యాంకర్‌ డెలివరీ..! Sun, May 19, 2024, 10:45 AM
మరో 3రోజులు వర్షాలే Sun, May 19, 2024, 10:20 AM