కేబుల్ బ్రిడ్జ్‌పై రూల్స్ సామాన్యులకేనా మీకు కాదా..? సీఐపై నెటిజన్ల ఫైర్

byసూర్య | Sun, May 05, 2024, 07:31 PM

 హైదరాబాద్‌ నగరంలో ఐకానిక్ ప్రదేశంగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పాపులర్ అయ్యింది. ఈ ప్రాంతానికి ప్రతిరోజు సందర్శకుల తాకిడి ఉండగా.. శని, ఆదివారాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. గతంలో కేబుల్ బ్రిడ్జిపై చాలా మంది వాహనాలు ఆపి సెల్ఫీలు దిగడం, బర్త్‌డే పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేసేవారు. వీటివల్ల కేబుల్ బ్రిడ్జిపై రద్దీ పెరిగి ట్రాఫిక్ సమస్యలు తలెత్తి.. తరచూ ప్రమాదాలు చోటుచేసుకునేవి. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు ఆంక్షలు విధించారు. కేబుల్ బ్రిడ్జిపై బర్త్‌డే పార్టీలు చేసుకోవడం, వాహనాలు ఆపి సెల్ఫీలు దిగడం వంటివి చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవటమే కాకుండా రూ.10 వేలు జరిమాన విధిస్తామని తెలిపారు. ఈ నిబంధనలు గత నెల 16వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చారు.


అయితే.. పోలీసులు పెట్టిన ఈ నిబంధనలను ఆ పోలీసులే అతిక్రమించటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రూల్స్‌ను అతిక్రమిస్తూ మాదాపూర్ సీఐ గడ్డం మల్లేష్.. కేబుల్ బ్రిడ్జిపై బర్త్‌డే పార్టీ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, గతంలో పోలీసులు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిన చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నాయి. కేబుల్ బ్రిడ్జిపై ఇదేం పని సారూ.. రూల్స్ కేవలం సామాన్యులకేనా..? పోలీసులకు రూల్స్ వర్తించవా..? అంటూ కామెంట్ల రూపంలో ప్రశ్నిస్తున్నారు. కేబుల్ బ్రిడ్జిపై ఇలా చేయొద్దు అలా చేయొద్దు అంటూ చెప్పిన మీరే.. ఇప్పుడు ఇలా చేయటమేంటి సార్.. అంటూ నిలదీస్తున్నారు. అందుకు సంబంధించిన పాత వీడియోలను షేర్ చేస్తున్నారు. అంతేకాకుకుండా.. రూల్స్ అతిక్రమించిన సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు.


Latest News
 

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు Sat, May 18, 2024, 10:32 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క Sat, May 18, 2024, 10:20 PM
ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు Sat, May 18, 2024, 10:15 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, May 18, 2024, 08:52 PM
యాదాద్రి కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ నిషేదం,,,ఉత్తర్వులు జారీ చేసిన ఈవో Sat, May 18, 2024, 08:50 PM