ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది.. కాపాడాలంటూ ఆర్తనాదాలు

byసూర్య | Fri, Apr 26, 2024, 07:27 PM

హైదరాబాద్ శివారులోని ఓ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలోని అలెన్ హోమియో అండ్ హెర్బల్ ప్రొడక్ట్ కంపెనీలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు ఎగిసిపడటంతో.. కంపెనీ మొత్తానికి మంటులు వ్యాపించాయి. ప్రమాద సమయంలో కంపెనీలో సుమారు 300 మంది కార్మికులు ఉండగా.. ప్రాణ భయంలో చాలా మంది బయటకు పరుగులు తీశారు. అయితే.. దట్టమైన పొగ అలుముకోవటంతో.. ఎటువెళ్లలేక సుమారు 50 మంది వరకు లోపలే చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది.


పొగ తట్టుకోలేక కొంత మంది కార్మికులు బిల్డింగ్ మీది నుంచి కిందికి దూకారు. దీంతో.. ప్రాణాలతో బయటపడినా తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు.. కంపెనీ లోపలి నుంచి తమను కాపాడాలంటూ కార్మికులు ఆర్తనాదాలు చేస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చిన 5 ఫైర్ ఇంజన్లు.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాగా.. అక్కడి వాతావరణమంతా దట్టమైన పొగ అలుముకోవటంతో సహాయక చర్యలకు ఇబ్బంది అవుతోంది. అయితే.. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య Sat, May 18, 2024, 07:57 PM
మెట్రో మాదిరిగా బస్సు సర్వీసులు,,,ప్రయాణికులకు ఇక నో టెన్షన్ Sat, May 18, 2024, 07:53 PM
మాజీ మంత్రి మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, May 18, 2024, 07:50 PM
వీడు మామూలోడు కాదు.. మెుత్తం ఆన్‌లైన్‌లోనే కానిచ్చేస్తున్నాడు Sat, May 18, 2024, 07:47 PM
హైదరాబాద్‌లో మరో ప్రీ-లాంచ్ ఆఫర్ మోసం.. కస్టమర్ల నుంచి రూ. 80 కోట్లు వసూళ్లు Sat, May 18, 2024, 07:45 PM