ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ

byసూర్య | Thu, Apr 18, 2024, 09:03 PM

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణలో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలు ప్రకటించిన అభ్యర్థులు ఇప్పటికే రంగంలోకి దిగి ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోలతో పాటు క్షేత్రస్థాయిలో కూడా పర్యటిస్తూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కొంపెల్ల మాధవీలత.. కూడా క్షేత్రస్థాయిలో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా.. ఇటీవల ఆమె ఓ విమానంలోని ప్రయాణికులకు వాటర్ బాటిళ్లు పంచిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. విమానంలో ప్రయాణికులకు వాటర్ బాటిళ్లు పంచుతూ మానవ సేవే మాధవ సేవ అని చెప్తున్నారంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ కూడా చేశారు.


అయితే.. ఈ ఘటనపై మాధవీలత స్పందించారు. ఓ మీడియా ఛానెల్‌ నిర్వహించిన డిబేట్‌లో పాల్గొ్న్న మాధవీలత.. తాను విమానంలో వాటర్ బాటిళ్లు పంచిన సందర్భం గురించి వివరించారు. తాను తమ పర్సనల్ పని మీద ఢిల్లీకి ప్రయాణం చేసే సందర్భంలో.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఫ్లైట్ 8 గంటలు డిలే అయ్యిందని తెలిపారు. ఆ సమయంలో.. ప్రయాణికులంతా చాలా అసహనానికి లోనయ్యారని.. తాను కూడా భోజనం చేయకుండా వెళ్లటంతో తాను తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డట్టు వివరించారు. ఆ సమయంలో.. అందరూ సిబ్బందిపైకి సీరియస్ అవుతుంటే.. తానే మిగతా ప్రయాణికులందరినీ శాంతపర్చానని మాధవీలత తెలిపారు.


ఆ తర్వాత తాను ఓ పాప్ కార్న్ ప్యాకెట్, వాటర్ బాటిల్ తెచ్చుకుని.. రెండు పాప్ కార్న్స్ నోట్లో వేసుకోగానే.. చిన్నపిల్లల ఏడుపు వినిపించిందని.. అది విని తన గుండె తరుక్కుపోయిందని చెప్పుకొచ్చారు మాధవీలత. విమానంలో ఏందో మంది.. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారని.. వాళ్లను వదిలిపెట్టి తాను మాత్రం స్వార్థంగా కడుపు నింపుకోవాలనుకోవటం కరెక్ట్ కాదని ఆలోచించి.. అప్పటికప్పుడు ఓ 20 పాప్ కార్న్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు తీసుకుని... అందులో ఉన్న వృద్ధులు, చిన్నపిల్లలకు ముందుగా తానే స్వయంగా పంచినట్టు మాధవీలత వివరించారు. దీన్ని.. ఎవరో ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టున్నారని.. వాటిని కొంత మంది తమకు నచ్చినట్టుగా వైరల్ చేసినట్టున్నారని మాధవీలత చెప్పుకొచ్చారు. ఇందులో తాను ఎలాంటి స్వార్థంతో ఆలోచించలేదని.. కేవలం వారి అసహనాన్ని తగ్గించేందుకు తనవంతు ప్రయత్నం చేశానని మాధవి లత చెప్పుకొచ్చారు.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM