తెలంగాణలో 10 వేల కోట్ల భారీ కుంభకోణం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

byసూర్య | Thu, Apr 18, 2024, 07:35 PM

లోక్ సభ ఎన్నికల వేళ.. తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మీద రకరకాల ఆరోపణలు చేస్తూనే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మొదలు.. ప్రతి పథకంలో భారీ ఎత్తున కుంభకోణాలు జరిగాయని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అసెంబ్లీలోనూ పలు అంశాలపై శ్వేతపత్రం విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష రూపాయల కుంభకోణం జరిగిందంటూ ఆరోణపలు చేస్తుండగా.. ఇప్పుడు కొత్తగా పది వేల కోట్ల భారీ స్కామ్ జరిగిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకింగ్ ఆరోపణలు చేశారు.


బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్‌లో సుమారు 10 వేల కోట్ల స్కామ్ జరిగిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వెయ్యి కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని.. ఆయన అక్రమాలపై ఇప్పటికే విచారణ జరుగుతోందని చెప్పుకొచ్చారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి.. త్వరలోనే జైలుకెళ్లటం ఖాయమని రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.


బీఆర్ఎస్ పార్టీ అనేది.. మునిగిపోయే నావ అని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నామరూపాల్లేకుండా పోతుందంటూ రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. ఎవరెన్ని కామెంట్లు చేసినా, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేసినా.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కారు.. కచ్చితంగా ఐదు సంవత్సరాల పాటు సుస్థిరంగా ఉంటుందని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM