ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

byసూర్య | Tue, Apr 09, 2024, 11:49 AM

తెలుగువారి మొదటి పండుగ ఉగాది. అందుకే ఈ పండుగను తెలుగు సంవత్సరాదిపండుగ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది.ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో వస్తుంది.. ఈ ఏడాదిలో ఏప్రిల్ 9 న వచ్చింది. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అంటారు. దీని అర్థం ఏంటంటే.. ఈ ఏడాది క్రొధమును ఎక్కువగా కలిగి ఉంటారు.. కుటుంబం, మనుషులు మధ్య కోపాలు, యుద్దాలు జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు.. ఇక ఈ పండుగ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.యుగాది లేదా ఉగాది అనే పదాలు ‘యుగ’ (యుగం) మరియు ‘ఆది’ (ప్రారంభం) అనే సంస్కృత పదాల నుండి ఉద్భవించాయి, ఇది ‘కొత్త యుగం ప్రారంభం’ అని సూచిస్తుంది. మాములుగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి చివరలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో వచ్చే ఈ రోజు హిందువులకు చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మహారాష్ట్రలో గుడి పడ్వా, తెలుగు రాష్ట్రాల్లో ఉగాది అని,కర్ణాటకలో యుగాది వంటి పేర్లతో ఉగాది పండుగను జరుపుకుంటారు.. పురాణాల ప్రకారం.. బ్రహ్మ దేవుడు విశ్వాన్ని సృష్టించాడు. తరువాత అతను రోజులు, వారాలు, నెలలు మరియు సంవత్సరాలను సృష్టించాడు.. ఇదే సంవత్సరానికి ఆది పర్వం అని అంటారు.ఇకపోతే ఈ పండుగను అందరు జరుపుకుంటారు.. ఈ పండుగ మొదలయ్యే వారం ముందు నుంచి సందడి మొదలవుతుంది.. ఉగాది పండుగను కూడా సంక్రాంతి లాగే ఘనంగా ఎవరికీ ఉన్నంతలో వాళ్లు జరుపుకుంటారు.. ఈరోజు ఎం చెయ్యాలంటే.. సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి గుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టాలి. తలకు నువ్వుల నూనె పట్టించి నలుగు పెట్టుకుని స్నానం చేసి, కొత్త బట్టలు లేదా శుభ్రమైన దుస్తులు ధరిస్తారు.. పాయసం, పులిహోర తో పాటుగా బొబ్బట్లను కూడా తప్పనిసరిగా చేసుకొని దేవుడికి సమర్పించి, ఉగాది పచ్చడిని కూడా చేసుకొని ఇంటిల్లి పాది ఆనందంగా ఆరగిస్తారు..


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM