సానియా మిర్జా తీరుపై మండిపడ్డ సజ్జనార్

byసూర్య | Mon, Jan 30, 2023, 05:40 PM

హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా క్యాంపెయిన్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్  ట్విట్టర్‌లో తప్పుబట్టారు మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థలకు ప్రచారం చేయవద్దని, ఇలాంటి సంస్థల వల్ల భారత ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుందని సానియా మీర్జాకు సూచించారు. అసలు సెలబ్రెటీలు ఎవరూ మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీలను ప్రమోట్ చేయడం, ప్రచారం చేయడం లాంటివి చేయవద్దని సజ్జనార్ కోరారు. ప్రముఖ మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీ క్యూనెట్‌కు సానియా మీర్జా ప్రచారం చేస్తున్నారు. దీంతో క్యూనెట్‌ సంస్థకు సానియా మీర్జా ప్రచారం చేయడాన్ని తప్పుబట్టిన సజ్జనార్.. అసలు సెలబ్రెటీలు ఎవరూ ఇలాంటి పనులు చేయవద్దని సూచించారు.


గతంలో సజ్జనార్ సైబరాబాద్ సీపీగా ఉన్న సమయంలో క్యూనెట్ సంస్ధపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆ సంస్థలో సోదాలు జరిపి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కొంతమందిని అరెస్ట్ చేశారు. ఆ సంస్ధకు చెందిన బ్యాంకుల్లోని రూ.కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. అయితే ఆ తర్వాత క్యూనెట్ సంస్ధ మళ్లీ హైదరాబాద్‌లో కార్యకలాపాలు తిరిగి ప్రారంభించింది. ఇటీవల ఆ సంస్థపై ఈడీ దాడులు కూడా జరిగాయి. మనీ లాండరింగ్, హవాలా ఆరోపణలు రావడంతో.. ఆ కంపెనీ కార్యాలయాలతో పాటు క్యూనెట్ అనుబంధ సంస్థ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థల్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. ముంబై, బెంగళూరు, చెన్నైలలోనూ ఈడీ సోదాలు జరిగాయి. అలాగే 36 బ్యాంకుల్లో క్యూనెట్‌కు సంబంధించిన రూ.90 కోట్లు ఇటీవల ఫ్రీజ్ చేశారు. ఈ క్రమంలో సజ్జనార్ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.


క్యూనెట్‌కు సానియా మీర్జా ప్రచారం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలుచోట్ల వినియోగదారులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. చట్ట వ్యతిరేకంగా క్యూనెట్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తుందని, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ పేరుతో వ్యాపారం కొనసాగిస్తుందని చెబుతున్నారు. ఈ కంపెనీలో చేరి తమ ఉత్పత్తులు అమ్మితే భారీ లాభం వస్తుందని చెప్పి మోసం చేస్తున్నారని, ఇలాంటి కంపెనీల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఉత్పత్తుల అమ్మకం పేరుతో మహిళలతో అసభ్యకరమైన పనులు కూడా చేయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.


 


Latest News
 

రిజర్వేషన్లను ముట్టుకునే ప్రసక్తే లేదు: అరవింద్ Fri, May 03, 2024, 03:26 PM
రైల్వే సమస్యలు ఎప్పుడు తీరుతాయో..? Fri, May 03, 2024, 03:23 PM
ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి - ఎమ్మెల్యే తోట Fri, May 03, 2024, 03:19 PM
ఎమ్యెల్యే ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారం Fri, May 03, 2024, 03:17 PM
మెదక్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం Fri, May 03, 2024, 02:50 PM