రూ.10లక్షలు విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టివేత

byసూర్య | Mon, Oct 25, 2021, 06:42 PM

సంగారెడ్డి  జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిషేధిత గుట్కా వ్యాపారంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమంగా నిల్వ చేసిన నిషేధిత గుట్కా ప్లాకెట్లను బొల్లారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


సీఐ ప్రశాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం..మున్సిపాలిటీ పరిధిలోని జ్యోతినగర్‌లో నిషేధిత గుట్కా ప్యాకెట్లు నిల్వ చేశారనే పక్కా సమాచారంతో పోలీసులు దత్తు అనే కిరాణా వ్యాపారస్తుడి దుకాణాంలో తనిఖీలు నిర్వహించారు. అమ్మకానికి నిలువ ఉంచిన నిషేధిత భారీ గుట్కా బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


పట్టుకున్న గుట్కా విలువ రూ.10లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రశాంత్‌ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో అక్రమంగా గుట్కా రవాణా చేసినా నిల్వ చేసి అమ్మకాలు జరిపినా సదరు వ్యక్తులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. తనిఖీల్లో ఎస్‌ఐ జయశంకర్‌, పోలీసు శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM