ఉత్తమ్ వారసుడు ఎవరో ?

byసూర్య | Sun, Aug 25, 2019, 11:20 PM

తె లంగాణ కాంగ్రెస్ పార్టీ లో అల్లకల్లోలం ఆపే  నాధుడెవరూ అర్ధం కావటం లేదు. రాష్ట్ర పార్టీని నడిపించే ఉత్తమ్ వారసుడు, అధ్యక్షుడు గా ఈనిక అయ్యే నేత ఎవరన్నా మీమాంస కొనసాగుతోంది, జాతీయ అధ్యక్షు ని గా రాహుల్ వారసుని ఎంపికకే నానా అగచాట్లు పది సోనియాకు భారం అప్పగించిన నేపథ్యంలో తెలంగాణ పార్టీ అధ్యక్షుని ఎంపిక పై  ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది,  సెప్టెంబర్ 8 లోపు రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడ్ని ప్రకటిస్తారని  పార్టీ వర్గాలంటున్నాయి.  తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్లు ఎంపీ ఏ.రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ టీ. జీవన్ రెడ్డిల లో ఒకరు కావచ్చన్నది తెలియవచ్చింది.   దక్షిణాదిలో పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అయినప్పటికి ఇటీవల సీనియర్లు సైతం జంప్ జిలానీలు కావడంతో  తప్పులు జరగకుండా ఉండేందుకు చర్యల్ని షురూ చేసినట్లుగా తెలుస్తోంది. 


కాగా  ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికే అన్ని అంశాలు అనుకూలంగా ఉన్నాయని.. అనుకోని రీతిలో ఏదైనా జరిగితే తప్పించి.. రేవంతే పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని  ఒకవేళ అనుకోని కారణాలతో ప్రస్తుతానికి జీవన్ రెడ్డికి పార్టీ పగ్గాలు ఇచ్చినా.. ఎన్నికల నాటికి మాత్రం రేవంత్ ను అధ్యక్ష కుర్చీలో కూర్చోబెట్టటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. 


Latest News
 

మెదక్ అభ్యర్థుల్లో టెన్షన్ Tue, May 14, 2024, 03:53 PM
మంచి మెజార్టీతో గెలుస్తానన్న నమ్మకం ఉంది: నామా Tue, May 14, 2024, 03:51 PM
తెలంగాణ వ్యాప్తంగా స్ట్రాంగ్‌ రూమ్స్‌ వద్ద 144 సెక్షన్‌ అమలు Tue, May 14, 2024, 02:13 PM
భట్టికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే Tue, May 14, 2024, 01:57 PM
జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి తుమ్మల Tue, May 14, 2024, 01:56 PM