సెప్టెంబర్ 29 నుండి 'బిగ్ బాస్ 13'

by సూర్య | Sun, Aug 25, 2019, 04:27 PM

‘బిగ్‌బాస్‌’ ప్రస్తుతం తెలుగువారికి ఎంతో దగ్గరైన రియాల్టీ షో. అయితే, హిందీలో 2006లోనే మొదలైంది. ఇక ఈ షోకు బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ‘బిగ్‌బాస్‌ సీజన్‌13’ ప్రారంభం కాబోతోంది. దీనికి కూడా సల్మాన్‌ఖాన్‌ హోస్ట్‌గా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీజన్‌ 13కు సంబంధించిన ప్రోమోను కలర్స్‌ టీవీ విడుదల చేసింది.


ఇందులో సల్మాన్‌ రైల్వే అనౌన్సర్‌గా కనిపించారు. ‘దయ చేసి వినండి. ఈసారి బిగ్‌బాస్‌ రైలు ప్రత్యేకమైన స్టార్స్‌తో రాబోతోంది. కేవలం నాలుగువారాల్లో మీ ముందుకు రానుంది. సెలబ్రిటీలు కూడా ఇందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి సీజన్‌ నాదే. అంతేకాదు, చిన్న ట్విస్ట్‌ కూడా ఉంది’ అంటూ సల్మాన్‌ టీజర్‌లో చెప్పుకొచ్చారు. సెప్టెంబరు 29న ఈ షో ప్రారంభంకానున్నట్లు సమాచారం. ఇందులో విజేతగా నిలిచిన వ్యక్తికి రూ.కోటి బహుమతిగా అందిస్తారు. 


తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకోగా, ప్రస్తుతం మూడో సీజన్‌ జరుగుతోంది. తొలి రెండు సీజన్లకు ఎన్టీఆర్‌, నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా, ప్రస్తుతం నాగార్జున హోస్ట్‌గా చేస్తున్నారు. 

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM