బిగ్‌బాస్‌-3 ప్ర‌సారం అడ్డుకోవాలంటూ హైకోర్టుకు

by సూర్య | Sat, Jun 22, 2019, 08:06 AM

నటుడు కమల్‌హాసన్ త‌మిళ ఛాన‌ల్‌లో  బిగ్‌బాస్‌-3 నిర్వ‌హ‌ణ‌కు ఓవైపు సిద్ద‌మ‌వుతుంటే, ఈ కార్యక్రమ ప్రసార‌మే నిల‌పి వేయాల‌నిఇందుకు స్టే  మంజూరు చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసారో న్యాయ‌వాది. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌లోకి వెళితే.  బిగ్‌బాస్‌ సీజన్‌ 1, సీజన్ 2  త‌దుప‌రి 23వ తేదీ నుంచి  బిగ్‌బాస్‌-3  ప్రారంభం కానున్న‌ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో  పాల్గొనే పోటీదారులు అశ్లీలంగా దుస్తులు ధరిస్తున్నారని, ద్వంద్వార్థాలతో మాట్లాడుతున్నారని , ఇది యువతకు పరిపాటియైనా తల్లిదండ్రులకు ఇబ్బందిక‌రంగా మారింద‌ని,   అందువల్ల ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసేందుకు ముందుగా సెన్సార్‌ బోర్డు తో తనిఖీ చేయించాలని అప్ప‌టి వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మ ప్ర‌సారాల‌పై స్టే విధించాల‌ని మద్రాసు హైకోర్టులో  న్యాయవాది సుదన్ కోర్ట్ త‌న పిటీష‌న్‌లో కోరారు.  ఇప్ప‌టికే ప్ర‌సారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నందున పిటీస‌న్ ర‌ద్దు చేయాల‌ని కోరుతోంది ఛాన‌ల్, మ‌రి కోర్టు నిర్ణ‌యం ఏముంటుందోన‌ని స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొందిప్పుడు.


 


 

Latest News
 
'జిగర్తాండ డబుల్ ఎక్స్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Tue, May 14, 2024, 03:11 PM
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాలకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'సత్యభామ' టీమ్ Tue, May 14, 2024, 03:09 PM
పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించిన 'ది గోట్' Tue, May 14, 2024, 03:07 PM
కొత్త రికార్డును సృష్టించిన 'థగ్ లైఫ్' Tue, May 14, 2024, 03:05 PM
శ్రీవిష్ణు తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించనున్న ప్రముఖ నిర్మాత Tue, May 14, 2024, 02:58 PM