తమిళచిత్రం సింధుబాద్ విడుదలకు బ్రేక్!

by సూర్య | Fri, Jun 21, 2019, 07:03 PM

తమిళ హీరో విజయ్ సేతుపతి, అంజలి జంటగా నటించిన సింధుబాద్ తమిళచిత్రం విడుదలకు బ్రేక్ పడింది. ఈ మూవీ విడుదలను నిలిపివేయాలని హైదరాబాద్ హైకోర్డు ఆదేశాలు జారీచేసింది. విజయ్ సేతుపతి హీరోగా అరుణ్ కుమార్ డెరెక్షన్ లో   తమిళ నిర్మాత రాజరాజన్ ఈ చిత్రాన్ని  నిర్మించారు. అయితే ఆయన గతంలో ఎస్ ఎస్ రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ  బాహుబలి చిత్రం  తమిళ హక్కుల్ని ఆర్కా మీడియానుంచి పొందారు.
బాహుబలి మూవీ తమిళనాడులో బ్రహ్మాండమైన వసూళ్లను రాబట్టింది.  మొత్తం  రూ.28 కోట్లు  కలెక్ట్ చేసింది. అయితే అగ్రిమెంట్ ప్రకారం  ఈ మూవీ   హక్కుల్ని అమ్మిన ఆర్కా మీడియాకు చెందిన  శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలకు  రాజరాజన్ రూ.12.5 కోట్లు బాకీ పడ్డారు. అయితే ఎన్నిసార్లు అడిగినా ఇవ్వాల్సిన బాకీ సొమ్మును  తమకు చెల్లించడంలేదంటూ రాజరాజన్ పై   బాహుబలి నిర్మాతలు ఇద్దరూ  హైదరాబాద్ హైకోర్డును ఆశ్రయించారు.  కేసును విచారించిన న్యాయస్ధానం బాకీ సొమ్మును చెల్లించే వరకు సింధు బాద్ చిత్రం విడుదల నిలిపివేయాలని ఆదేశించింది.   సింధు బాద్ చిత్రం తమిళంలో హైప్ క్రియేట్ చేస్తున్న సమయంలో హైకోర్టు తాజా ఆదేశాలపై నిర్మాత రాజరాజన్ ఎలా స్పందిస్తారో చూడాలి.


 

Latest News
 
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM
14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న తెలుగు నటి Fri, May 03, 2024, 06:22 PM
'ఆవేశం' OTT అరంగేట్రం అప్పుడేనా? Fri, May 03, 2024, 06:19 PM
30M వ్యూస్ ని సొంతం చేసుకున్న గేమ్ ఛేంజర్ లోని 'జరగండి' సాంగ్ Fri, May 03, 2024, 06:12 PM
'డబుల్ ఇస్మార్ట్' కొత్త షెడ్యూల్ ప్రారంభం ఎప్పుడంటే...! Fri, May 03, 2024, 06:07 PM