భారీ మల్టీ స్టారర్ కి షాకింగ్ రన్‌టైమ్

by సూర్య | Wed, Oct 30, 2024, 02:18 PM

రోహిత్ శెట్టి దర్శకత్వంలో అజయ్ దేవగన్ ఒక చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'సింఘం ఎగైన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. హిందీలో మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్‌లలో సింగం ఎగైన్ ఒకటి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటైన సింగం ఎగైన్ ట్రైలర్ ఇటీవలే విడుదల అయ్యి సెన్సేషన్ సృష్టించింది. తాజగా మూవీ మేకర్స్ ఈ కాప్ డ్రామా144 నిమిషాల (2 గంటల 24 నిమిషాలు) రన్ టైమ్ ని కలిగి ఉన్నట్లు ప్రకటించారు. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ఐకానిక్ చుల్బుల్ పాండేగా ఈ సినిమాలో నటించనున్నారు. సింఘం ఎగైన్ అనేది ప్రముఖ సింఘం ఫ్రాంచైజీలో మూడవ చిత్రం మరియు అక్షయ్ కుమార్, కరీనా కపూర్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే మరియు టైగర్ ష్రాఫ్‌ ఈ హై ఆక్టేన్ సినిమాలో కనిపించనున్నారు. అజయ్ దేవగన్, జ్యోతి దేశ్ పాండే, రోహిత్ శెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు. ఈ చిత్రం నవంబర్ 1, 2024న థియేటర్లలోకి రానుంది.

Latest News
 
SMB 29: ఈసారి వెయిట్ లేదు, Globetrotter విడుదల డేట్ బయటపెట్టారు Sat, Nov 15, 2025, 10:53 PM
Varanasi Movie: మహేశ్ స్టైలిష్ స్పెషల్ క్లిప్ వచ్చేసింది! Sat, Nov 15, 2025, 10:18 PM
రాజమౌళి స్పెషల్ అప్‌డేట్: గ్లోబ్ ట్రాటర్ టైటిల్ & గ్లింప్స్ రెడీ! Sat, Nov 15, 2025, 08:24 PM
మహేష్‌బాబు సినిమా టైటిల్ రిలీజ్‌.. అభిమానుల్లో జోష్ Sat, Nov 15, 2025, 07:30 PM
మాస్ జాతర.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్! Sat, Nov 15, 2025, 04:41 PM