యూట్యూబ్ మ్యూజిక్ ట్రేండింగ్ లో 'మట్కా' సెకండ్ సింగల్

by సూర్య | Fri, Oct 25, 2024, 03:34 PM

కరుణ కుమార్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మట్కా' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా టీజర్ కి భారీ స్పందన లభించింది. భారీ అంచనాలతో రూపొందుతున్న చిత్రం యొక్క యాక్షన్-ప్యాక్డ్ టీజర్ మరియు మేకింగ్ వీడియోలు విపరీతమైన సంచలనాన్ని సృష్టించాయి. ఈ పాన్-ఇండియన్ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు నోరా ఫతేహి కథానాయికలగా నటిస్తున్నారు. 1958 నుండి 1982 వరకు 24 సంవత్సరాల పాటు సాగే కథ కారణంగా వరుణ్ తేజ్ మట్కాలో ఇప్పటి వరకు అత్యంత సవాలుగా ఉండే పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం వరుణ్ తేజ్ పాత్ర యొక్క యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు ప్రయాణాన్ని ప్రదర్శిస్తుంది. ఈ పీరియాడికల్ డ్రామా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి సెకండ్ సింగల్ ని తస్సాదియ్యా అనే టైటిల్ తో విడుదల చేసారు. GV ప్రకాష్ కుమార్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి భాస్కర్ భట్ల లిరిక్స్ అందించగా మనో తన గాత్రాన్ని అందించారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సాంగ్ యూట్యూబ్ మ్యూజిక్ లో ట్రేండింగ్ లో ఉన్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవిశంకర్ మరియు ఇతరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. టెక్నికల్ క్రూలో జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజర్, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్ గా ఉన్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై డా.విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం నవంబర్ 14న విడుదల కానుంది.

Latest News
 
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM
నంద్యాల కేసులో అల్లు అర్జున్‌కి హైకోర్టు స్టే ఆర్డర్ Fri, Oct 25, 2024, 07:42 PM
1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'క' ట్రైలర్ Fri, Oct 25, 2024, 07:36 PM
'SDT 18' గురించి వివరాలను వెల్లడించిన సాయి దుర్ఘ తేజ్ Fri, Oct 25, 2024, 07:31 PM
'మా నాన్న సూపర్‌హీరో' నుండి కన్నీళ్లు లెవా వీడియో సాంగ్ అవుట్ Fri, Oct 25, 2024, 05:34 PM