ఓటీటీలోకి రాబోతున్న అదా శర్మ మూవీ

by సూర్య | Thu, Oct 24, 2024, 08:02 PM

తెలుగులో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాను ఆహా వీడియో స్ట్రీమింగ్ చేయనుంది.ఐఎండీబీలో 8.7 రేటింగ్ సాధించిన ఈ సినిమా థియేటర్లలో రిలీజైన ఐదు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం. ఈ సినిమాలో అదా శర్మ లీడ్ రోల్లో నటించింది.ఓటీటీలోకి రాబోతున్న మూవీ పేరు సీ.డీ (క్రిమినల్ ఆర్ డెవిల్). కృష్ణ అన్నం డైరెక్ట్ చేసిన ఈ సినిమా శనివారం (అక్టోబర్ 26) నుంచి ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ గురువారం (అక్టోబర్ 24) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది."డార్క్ సైడ్ లోకి ఎంటరవడానికి సిద్ధంగా ఉండండి.. క్రిమినల్ ఆర్ డెవిల్ అక్టోబర్ 26న ప్రీమియర్ కానుంది" అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ డేట్ రివీల్ చేసింది.


క్రిమినల్ ఆర్ డెవిల్ ఎలా ఉందంటే?


అదా శర్మ, విశ్వంత్ దుద్దుంపూడి నటించిన క్రిమినల్ ఆర్ డెవిల్ మూవీ ఈ ఏడాది మే 24న థియేటర్లలో రిలీజైంది. ఇది సిద్దూ (విశ్వంత్), రక్ష (అదా శర్మ) అనే ఇద్దరు వ్యక్తుల చుట్టూ తిరిగే కథ. పిల్లలను కిడ్నాప్ చేసే పాత్రలో అదా శర్మ నటించడం విశేషం. ఆమెను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తూ ఉంటారు.మరోవైపు ఒంటరిగా ఉండే సిద్దూ దెయ్యాలున్నాయని భయపడుతూ ఉంటాడు. అలాంటి సిద్దూని ఓ రూమ్ లో బంధిస్తుంది రక్ష. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు రక్ష.. సిద్దూని ఎందుకు టార్గెట్ చేసింది? పిల్లలను కిడ్నాప్ చేయడం వెనుక ఉన్నదెవరు? పోలీసులు ఈ కేసును ఛేదిస్తారా అన్నది మూవీలో చూడొచ్చు.


థియేటర్లలో రిలీజైన ఐదు నెలల తర్వాత ఈ సీ.డీ (క్రిమినల్ ఆర్ డెవిల్) ఓటీటీలోకి వస్తుండటం విశేషం. ఐఎండీబీలో 8.7 రేటింగ్ ఉందంటే ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లు. అలాంటి సినిమా ఇప్పుడు ఆహా వీడియోలోకి రాబోతోంది. మరి డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. శనివారం (అక్టోబర్ 26) నుంచి క్రిమినల్ ఆర్ డెవిల్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడండి.

Latest News
 
రష్మికకు సెక్యూరిటీ పెంపు.. కారణం ఏంటంటే? Thu, Oct 24, 2024, 08:18 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'పోటెల్' Thu, Oct 24, 2024, 07:47 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'అమరన్‌' Thu, Oct 24, 2024, 07:41 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మెకానిక్ రాకీ' ట్రైలర్ Thu, Oct 24, 2024, 07:38 PM
'కంగువ' ఆడియో లాంచ్ కి వెన్యూ ఖరారు Thu, Oct 24, 2024, 07:33 PM