కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'రోటీ కప్డా రొమాన్స్'

by సూర్య | Thu, Oct 24, 2024, 03:56 PM

హర్ష నర్రా, సందీప్ సరోజ్ మరియు ఇతరులు ప్రధాన పాత్రల్లో యూత్‌ఫుల్ కామెడీ సినిమాని చేస్తున్నారు. ఈ చిత్రానికి 'రోటీ కప్డా రొమాన్స్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఇటీవలే విదుహాలైన ఈ సినిమా ట్రైలర్ మూవీ పై భారీ బజ్ ని క్రియేట్ చేసింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ చిత్రం నవంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ప్రేక్షకులకు కొత్త సందేశాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని నిర్మాతలు తెలిపారు. దర్శకుడు విక్రమ్ రెడ్డి ఆకట్టుకునేలా సినిమాను తెరకెక్కించాడు. ఇటీవల, యువకుల కోసం ఒక ప్రదర్శన నిర్వహించబడింది మరియు వారి అభిప్రాయం మేకర్స్‌కు మరింత నమ్మకం కలిగించింది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సినిమాకు చాలా ప్లస్ అవుతుంది. 'హుషారు', 'సినిమా చూపిస్త మామ', 'మేం వయసుకు వచ్చాం', 'ప్రేమ ఇష్క్ కాదల్' మరియు 'పాగల్' ఫేమ్ లక్కీ మీడియా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాతో హిట్ కొట్టడానికి సిద్ధంగా ఉంది. రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో వచ్చిన ఈ చిత్రాన్ని బెక్కం వేణుగోపాల్ మరియు సృజన్ కుమార్ బొజ్జం నిర్మించారు. 

Latest News
 
రష్మికకు సెక్యూరిటీ పెంపు.. కారణం ఏంటంటే? Thu, Oct 24, 2024, 08:18 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'పోటెల్' Thu, Oct 24, 2024, 07:47 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'అమరన్‌' Thu, Oct 24, 2024, 07:41 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మెకానిక్ రాకీ' ట్రైలర్ Thu, Oct 24, 2024, 07:38 PM
'కంగువ' ఆడియో లాంచ్ కి వెన్యూ ఖరారు Thu, Oct 24, 2024, 07:33 PM