కొత్త కారు కొన్న బాలీవుడ్ స్టార్

by సూర్య | Wed, Oct 23, 2024, 04:07 PM

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.కొద్దిరోజుల క్రితమే కూతురితో కలిసి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఈ క్రమంలో స్టార్ హీరో రణవీర్ సింగ్ కొత్తగా లగ్జరీ కారు కొన్నట్లు తెలుస్తోంది. రణవీర్ సింగ్ కొత్త కారు కోసం భారీ మొత్తంలో ఖర్చు చేశాడని సమాచారం. కూతురు రాకతో సంతోషంలో ఉన్న రణవీర్, దీపిక దంపతులు తమ ఇంట్లోకి ఇప్పుడు మరో అతిథిని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఈ లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రణవీర్ సింగ్ వద్ద ఇప్పటికే చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు ఐషారామి మరో కారును కొనుగోలు చేశాడు.


ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీస్ దగ్గర ఉన్న రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశాడు. ఈ కారు కోసం రణవీర్ సింగ్ రూ.4.74 కోట్లు చెల్లించాడు. ఈ కారుకు ప్రత్యేక నంబర్ కూడా ఉంది. ఇందుకోసం అప్పట్లో భారీ మొత్తం చెల్లించాడు. రణ్‌వీర్ సింగ్ రేంజ్ రోవర్ 4.4 ఎల్‌డబ్ల్యుబి కారును కొనుగోలు చేశాడు. రేంజ్ రోవర్ కార్ సిరీస్‌లోని అత్యుత్తమ, టాప్ ఎండ్ కార్లలో ఇది కూడా ఒకటి. రణవీర్ సింగ్ ఈ కారులో కొన్ని ప్రత్యేకమైన కస్టమ్ మేడ్ మార్పులు చేసాడు. రణవీర్ సింగ్ ఈ కారుకు 6969 నంబర్ ఉంది. ఇది తనకు ఇష్టమైన నంబర్ అని తెలుస్తోంది.తండ్రి అయిన తర్వాత రణవీర్ సింగ్ కొంతకాలం లకు విరామం తీసుకున్నాడు. రణవీర్ సింగ్, దీపిక జంటగా నటించిన ‘సింగం ఎగైన్’ చిత్రం వచ్చే వారం విడుదల కానుంది. ఇది కాకుండా రణ్‌వీర్ సింగ్ ‘ధురందర్’ అనే లో నటిస్తున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తమిళ చిత్రం ‘అన్నియన్’ హిందీ రీమేక్‌లో రణవీర్ నటించనున్నాడు. తెలుగులో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రణ్‌వీర్ ఓ లో నటించాల్సి ఉంది కానీ ఆ ప్రాజెక్ట్ తాత్కాలికంగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. దీపిక చివరిసారిగా కల్కి చిత్రంలో నటించింది.

Latest News
 
'అమరన్' ట్రైలర్ అవుట్ Wed, Oct 23, 2024, 08:30 PM
ధనుష్, ఐశ్వర్య షాకింగ్ నిర్ణయం Wed, Oct 23, 2024, 07:42 PM
వార్ 2: హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ పరిచయ సన్నివేశాల గురించి ఆసక్తికరమైన బజ్ Wed, Oct 23, 2024, 07:36 PM
గజిని-2పై అల్లు అరవింద్ ఫోకస్! Wed, Oct 23, 2024, 07:34 PM
'క' ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Wed, Oct 23, 2024, 07:31 PM