డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మ్యాడ్ స్క్వేర్' టీమ్

by సూర్య | Wed, Oct 23, 2024, 03:23 PM

సంగీత్ శోభన్, నార్నే నితిన్ మరియు రామ్ నితిన్ నటించిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ మ్యాడ్ బాక్స్ఆఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక ​​సనీల్‌కుమార్, మరియు గోపికా ఉద్యాన్ మహిళా కథానాయికలుగా నటించారు. కళ్యాణ్ శంకర్ ఈ మ్యాడ్ క్యాప్ ఎంటర్‌టైనర్‌కి దర్శకత్వం వహించారు. మేకర్స్ ఇప్పటికే మ్యాడ్ స్క్వేర్ పేరుతో ఈ కామెడీ డ్రామాకి సీక్వెల్ ప్రకటించారు. మొదటి విడతకు మంచి రెస్పాన్స్ రావడంతో సీక్వెల్ భారీ స్థాయిలో తెరకెక్కనుంది. ఈ సీక్వెల్‌కి కూడా కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ సింగల్ కి సాలిడ్ రెస్పాన్స్ లభించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమా సాంకేతిక సిబ్బందిలో ఏస్ సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్ సైనుదీన్ ISC, ఎడిటర్ నవీన్ నూలి మరియు రచయిత-దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఉన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన హారిక సూర్యదేవర, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌కి చెందిన సాయి సౌజన్యతో కలిసి మ్యాడ్ స్క్వేర్‌ను నిర్మిస్తున్నారు. నాగ వంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

Latest News
 
సైలెంట్‌గా 2 సినిమాలను పూర్తి చేసిన అనుష్క శెట్టి Wed, Oct 23, 2024, 05:40 PM
పెళ్లి వీడియోతో షాక్ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శన్ Wed, Oct 23, 2024, 05:35 PM
ప్రొడ్యూసర్ విక్రమ్ రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'విశ్వంభర' టీమ్ Wed, Oct 23, 2024, 05:28 PM
'అర్థమైంద అరుణ్ కుమార్' సీజన్ 2 ట్రైలర్ అవుట్ Wed, Oct 23, 2024, 05:24 PM
బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌, కల్కి లాంటి ల్యాండ్‌మార్క్ మూవీ కంగువ - సూర్య Wed, Oct 23, 2024, 05:17 PM