'కంగువ' హైదరాబాద్ ప్రమోషన్ మీట్ డీటెయిల్స్

by సూర్య | Wed, Oct 23, 2024, 03:13 PM

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య తన తదుపరి సినిమాని శివ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'కంగువ' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ యాక్షన్ డ్రామా గత జన్మల కాన్సెప్ట్‌తో రూపొందింది. ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. ఈ సినిమా అన్ని భాషలలో 3D ఫార్మటు లో విడుదల కానుంది. ఈ ఫాంటసీ యాక్షన్ చిత్రం "కంగువ" విడుదలకు ఒక నెల మాత్రమే సమయం ఉండటంతో, నిర్మాతలు ప్రమోషన్స్ ని ప్రారంభించారు. తాజాగా మూవీ మేకర్స్ హైదరాబాద్ లో రేపు అంటే అక్టోబర్ 24న సాయంత్రం 5 గంటలకి AMB సినిమాస్ లో మీట్ ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు  చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో దిశా పాటని కథానాయికగా నటిస్తుంది. బాబీ డియోల్, యోగి బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం యొక్క బడ్జెట్ మూడు వందల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ మాగ్నమ్ ఓపస్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రొడక్షన్‌ హౌస్‌ స్టూడియో గ్రీన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Latest News
 
'అమరన్' ట్రైలర్ అవుట్ Wed, Oct 23, 2024, 08:30 PM
ధనుష్, ఐశ్వర్య షాకింగ్ నిర్ణయం Wed, Oct 23, 2024, 07:42 PM
వార్ 2: హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ పరిచయ సన్నివేశాల గురించి ఆసక్తికరమైన బజ్ Wed, Oct 23, 2024, 07:36 PM
గజిని-2పై అల్లు అరవింద్ ఫోకస్! Wed, Oct 23, 2024, 07:34 PM
'క' ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Wed, Oct 23, 2024, 07:31 PM