'మట్కా' సెకండ్ సింగల్ ప్రోమో విడుదల ఎప్పుడంటే...!

by సూర్య | Wed, Oct 23, 2024, 03:03 PM

కరుణ కుమార్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మట్కా' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం నవంబర్ 14న విడుదల కానుంది. ఈ పాన్-ఇండియన్ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు నోరా ఫతేహి కథానాయికలగా నటిస్తున్నారు. 1958 నుండి 1982 వరకు 24 సంవత్సరాల పాటు సాగే కథ కారణంగా వరుణ్ తేజ్ మట్కాలో ఇప్పటి వరకు అత్యంత సవాలుగా ఉండే పాత్రను పోషిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి భారీ స్పందన లభించింది. ఈ సినిమా నుండి సెకండ్ సింగల్ ని తస్సాదియ్యా అనే టైటిల్ తో అక్టోబర్ 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సాంగ్ యొక్క ప్రోమోని ఈరోజు సాయంత్రం 5:04 గంటలకి విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. GV ప్రకాష్ కుమార్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి భాస్కర్ భట్ల లిరిక్స్ అందించగా, మనో తన గాత్రాన్ని అందించారు. భారీ అంచనాలతో రూపొందుతున్న చిత్రం యొక్క యాక్షన్-ప్యాక్డ్ టీజర్ మరియు మేకింగ్ వీడియోలు విపరీతమైన సంచలనాన్ని సృష్టించాయి. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవిశంకర్ మరియు ఇతరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. టెక్నికల్ క్రూలో జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజర్, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్ గా ఉన్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై డా.విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు.

Latest News
 
'RC16' షూటింగ్ ప్రారంభం అప్పుడేనా? Wed, Oct 23, 2024, 04:43 PM
రాజమండ్రిలో 'క' ప్రమోషన్స్ Wed, Oct 23, 2024, 04:37 PM
నాగార్జున, బాలకృష్ణతో 'కంగువ' ను ప్రమోట్ చేయనున్న సూర్య Wed, Oct 23, 2024, 04:30 PM
మలైకా ఫిట్‏నెస్ సీక్రెట్.. ఎలాంటి వర్కవుట్స్ ... Wed, Oct 23, 2024, 04:27 PM
10M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కంగువ' సెకండ్ సింగిల్ Wed, Oct 23, 2024, 04:27 PM