'దేవర పార్ట్ 1' నుండి ఆయుధ పూజ వీడియో సాంగ్ అవుట్

by సూర్య | Tue, Oct 22, 2024, 04:39 PM

జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం "దేవర పార్ట్ 1" బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రతి ప్రాంతంలో కొత్త రికార్డులను నెలకొల్పింది. మిశ్రమ సమీక్షలు ఉన్నప్పటికీ ఈ చిత్రం ఆకట్టుకునే వసూళ్లను సాధించింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 509 కోట్లు వాసులు చేసింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఆయుధ పూజ వీడియో సాంగ్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ, ప్రేక్ష రాజ్, అజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న "దేవర: పార్ట్ 1" ఎపిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తుంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతాన్ని అందించారు.

Latest News
 
'సూర్య45' హీరోయిన్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Tue, Oct 22, 2024, 06:47 PM
బజ్ : 'NBK 109' విడుదల అప్పుడేనా? Tue, Oct 22, 2024, 06:40 PM
'క' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Tue, Oct 22, 2024, 06:36 PM
పెయిడ్ ప్రీమియర్‌లను ప్లాన్ చేస్తున్న 'పోటెల్' Tue, Oct 22, 2024, 06:30 PM
'సీతా పయనం' లో సీత గా ఐశ్వర్య Tue, Oct 22, 2024, 06:26 PM