'విశ్వంభర' లో క్రేజీ కమెడియన్

by సూర్య | Mon, Oct 21, 2024, 11:14 AM

మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని బింబిసార సినిమాతో ప్రఖ్యాతి గాంచిన వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. సోషియో-ఫాంటసీ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి 'విశ్వంబర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. 2024 సంక్రాంతి సీజన్‌లో విశ్వంభర విడుదల కానందున చిరంజీవి అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. హాస్యనటుడు సత్య, మెగాస్టార్ చిరంజీవి నటించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన "విశ్వంభర"లో చాలా అవసరమైన హాస్యాన్ని చొప్పించబోతున్నట్లు సమాచారం. సోషియో-ఫాంటసీ చిత్రం కోసం సత్య ఇప్పటికే అనేక  కామెడీ సన్నివేశాలు మరియు డైలాగ్‌లను చిత్రీకరించాడని సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా త్రిష కృష్ణన్ నటిస్తుంది. ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి మరియు కునాల్ కపూర్‌ల ఈ సినిమాలో కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి అకాడమీ అవార్డ్-విజేత MM కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. UV క్రియేషన్స్ భారీ స్థాయిలోఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Latest News
 
‘రాజా సాబ్' నుంచి క్రేజీ అప్డేట్ Mon, Oct 21, 2024, 02:44 PM
గూస్ బంప్స్ వచ్చాయి: నటుడు అజయ్ Mon, Oct 21, 2024, 01:04 PM
'పొటెల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Mon, Oct 21, 2024, 11:46 AM
యూట్యూబ్ లో 'మెకానిక్ రాకీ' ట్రైలర్ కి భారీ స్పందన Mon, Oct 21, 2024, 11:37 AM
సిటాడెల్ హనీ బన్నీ కోసం నేను అనుకున్న మొదటి నటి సమంత - వరుణ్ ధావన్ Mon, Oct 21, 2024, 11:31 AM