నేడు విడుదల కానున్న 'లక్కీ బాస్కర్' ట్రైలర్

by సూర్య | Mon, Oct 21, 2024, 10:19 AM

వెంకీ అట్లూరి దర్శకత్వంలో మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన రాబోయే చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'లక్కీ బాస్కర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. కొన్ని నెలల క్రితం విడుదలైన టీజర్ మరియు పాటలకు మంచి స్పందన లభించడంతో లక్కీ బాస్కర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ప్రమోషన్స్ ని మూవీ మేకర్స్ ఇటీవలే ప్రారంభించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకి హైదరాబాద్ లోని AMB స్క్రీన్ 1 లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ బహుభాషా చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమాని అక్టోబర్ 31న దీవాలి సందర్భంగా విడుదల కానుంది.

Latest News
 
గూస్ బంప్స్ వచ్చాయి: నటుడు అజయ్ Mon, Oct 21, 2024, 01:04 PM
'పొటెల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Mon, Oct 21, 2024, 11:46 AM
యూట్యూబ్ లో 'మెకానిక్ రాకీ' ట్రైలర్ కి భారీ స్పందన Mon, Oct 21, 2024, 11:37 AM
సిటాడెల్ హనీ బన్నీ కోసం నేను అనుకున్న మొదటి నటి సమంత - వరుణ్ ధావన్ Mon, Oct 21, 2024, 11:31 AM
యాక్షన్‌తో కూడిన 'బగీరా' ​​ట్రైలర్ అవుట్ Mon, Oct 21, 2024, 11:25 AM