'లక్కీ బాస్కర్' మీట్ అండ్ గ్రీట్ డీటెయిల్స్

by సూర్య | Mon, Oct 21, 2024, 09:24 AM

వెంకీ అట్లూరి దర్శకత్వంలో మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన రాబోయే చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'లక్కీ బాస్కర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా అక్టోబర్ 31న దీవాలి సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ని మూవీ మేకర్స్ ఇటీవలే ప్రారంభించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ప్రమోషన్స్ లో భగంగా మీట్ అండ్ గ్రీట్ అనే ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 24న కేరళలోని కోచిలో లులు మాల్ లో సాయంత్రం 6 గంటల నుండి ఈ ఈవెంట్ ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ బహుభాషా చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కొన్ని నెలల క్రితం విడుదలైన టీజర్ మరియు పాటలకు మంచి స్పందన లభించడంతో లక్కీ బాస్కర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

Latest News
 
గూస్ బంప్స్ వచ్చాయి: నటుడు అజయ్ Mon, Oct 21, 2024, 01:04 PM
'పొటెల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Mon, Oct 21, 2024, 11:46 AM
యూట్యూబ్ లో 'మెకానిక్ రాకీ' ట్రైలర్ కి భారీ స్పందన Mon, Oct 21, 2024, 11:37 AM
సిటాడెల్ హనీ బన్నీ కోసం నేను అనుకున్న మొదటి నటి సమంత - వరుణ్ ధావన్ Mon, Oct 21, 2024, 11:31 AM
యాక్షన్‌తో కూడిన 'బగీరా' ​​ట్రైలర్ అవుట్ Mon, Oct 21, 2024, 11:25 AM