' దేవర ' 20 డేస్ కలెక్షన్

by సూర్య | Fri, Oct 18, 2024, 03:53 PM

ఇండస్ట్రీలో టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి వచ్చిన సినిమాల లాంగ్ అని చూసి చాలా కాలమే అవుతుంది. కానీ.. ఎన్టీఆర్ దేవర సినిమా ఇప్పటికి అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది.లాంగ్ రన్ లోనూ.. మంచి కలెక్షన్ రాబడుతుంది. సినిమా రిలీజై నిన్నటితో 20 రోజులు పూర్తయినా.. ఇప్పటికీ మంచి కలెక్షన్లను దక్కించుకుంటుంది. ఆర్‌ఆర్ఆర్ సినిమాకి కూడా వరుసగా 17 రోజులు మాత్రమే కోటి రూపాయల గ్రాస్‌వశూళ్ళు రాగా.. దేవరకి ఏకంగా 19 రోజులు నాన్ స్టాప్ గా కోటి రూపాయల వసూలు రావడం విశేషం. ఇక 20వ రోజున జీఎస్టీ తో కలిపి 80 లక్షలు షేర్ వసూళ్ళు వచ్చాయి.మొత్తంగా 20 రోజులకు ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.130 కోట్లకు పైగా షేర్ వసూళ్లను సొంతం చేసుకుంది. నైజం ప్రాంతంలో 20 రోజులకు రూ.44 కోట్లు వచ్చాయి. ఇక రిటర్న్ జీఎస్టీలతో కలిపి రూ.50 కోట్ల వరకు వచ్చాయని సమాచారం. అలాగే సీడెడ్ లో రూ.30 కోట్లు, గుంటూరు రూ.12 కోట్లు, పశ్చిమగోదావరి రూ.7 కోట్లు, తూర్పుగోదావరి రూ.8 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.15 కోట్లు, కృష్ణ రూ.8కోట్లు, నెల్లూరు జిల్లా రూ.5 కోట్లు షేర్ వసూళ్ళను తగ్గించుకున్నాయి. అలా మొత్తం మీద రూ.130 కోట్ల వసూళ్ళు సంపాదించింది దేవర.


ఇక కర్ణాటకలో రూ.17 కోట్ల వసూళ్లు.. తమిళనాడులో రూ.4 కోట్లు , కేరళలో రూ.50 లక్షలు, బాలీవుడ్‌లో రూ.33 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.37 కోట్లు షేర్‌వసూళను సంపాదించుకుంది. ఇలా మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా దేవర 20 రోజులకు రూ.220 కోట్లకు పైగా షేర్ వసూళ్లు.. రూ.410 కోట్లకు పైగా గ్రాస్‌వసూళను దక్కించుకుంది. ఇక 20 రోజులకు కలెక్షన్ తో మరో రేర్ రికార్డును బ్రేక్ చేసిన దేవర.. టాప్ సిక్స్ లో ఒకటిగా నిలిచింది. మొదటి స్థానంలో బాహుబలి 2 ఉంటే రెండో స్థానంలో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది, తర్వాత బాహుబలి, కల్కి, హనుమాన్ ఇక టాప్ సిక్స్ లో దేవర స్థానాన్ని దక్కించుకుంది.

Latest News
 
ఈ వారం OTTలో విడుదల కానున్న సిరీస్ మరియు సినిమాలు Fri, Oct 18, 2024, 05:27 PM
అఖిల్ తదుపరి సినిమాపై తాజా అప్డేట్ Fri, Oct 18, 2024, 05:23 PM
డైరెక్టర్ జ్యోతి కృష్ణ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'హరి హర వీర మల్లు' టీమ్ Fri, Oct 18, 2024, 05:18 PM
'వేట్టైయన్' ప్రీక్వెల్ గురించి ఓపెన్ అయ్యిన దర్శకుడు Fri, Oct 18, 2024, 05:06 PM
సూర్యతో తన సినిమా గురించి షాకింగ్ విషయాలని వెల్లడించిన కార్తీక్ సుబ్బరాజ్ Fri, Oct 18, 2024, 05:03 PM