కల్యాణ్ దేవ్‌ను వేధిస్తున్న పది మంది అరెస్టు!

by సూర్య | Fri, Jun 14, 2019, 07:55 PM

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు సినీ నటుడు కల్యాణ్ దేవ్‌ను వేధిస్తున్న పది మంది పోకిరీలను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది రోజులుగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కల్యాణ్‌దేవ్‌‌పై కొందరు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వేదిస్తున్నారు. ఇటీవల కాలంలో వేధింపులు ఎక్కువ కావడంతో కల్యాణ్‌దేవ్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇన్‌స్టగ్రామ్ యాజమాన్యంతో కలిసి వేధింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించారు. పక్కా ఆధారాలు సేకరించి పది మంది పోకిరీలను అరెస్ట్ చేసి, సెక్షన్ 67 ప్రకారం కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల క్రితం ‘విజేత’ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన కల్యాణ్‌దేవ్.. తన నటతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మరో సినిమా చేస్తున్నారు.


 

Latest News
 
అమితాబ్ బచ్చన్ మనవడితో రొమాన్స్ చేయనున్న అక్షయ్ కుమార్ మేనకోడలు Fri, Apr 26, 2024, 07:13 PM
'రామం రాఘవం' టీజర్ విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:01 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'కృష్ణమ్మ' Fri, Apr 26, 2024, 06:56 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'సరిపోద శనివారం' Fri, Apr 26, 2024, 06:42 PM
బుక్ మై షోలో 'స్త్రీ2' సెన్సేషన్ Fri, Apr 26, 2024, 06:39 PM