ఆస్ట్రేలియాలో $800K మార్క్ ని చేరుకున్న 'దేవర'

by సూర్య | Tue, Oct 01, 2024, 09:44 PM

మ్యాన్ అఫ్ మస్సెస్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా దేవర బాక్స్ఆఫీస్ వద్ద అద్భుతమైన ప్రారంభాన్ని కలిగి ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల మైలురాయిని అధిగమించిందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా యొక్క ఆస్ట్రేలియా రైట్స్ ని టాలీ మూవీస్ బ్యానర్ సొంతం చేసుకుంది. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా ఆస్ట్రేలియాలో అత్యద్భుతమైన $800K గ్రాస్ ని వాసులు చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ పతాకాలపై కొసరాజు హరికృష్ణ మరియు సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా భారీ-టికెట్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. రాక్‌స్టార్ అనిరుధ్ ఈ సినిమాకి స్వరాలు సమకూర్చారు. శివ కోరటాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ కీలక పాత్రలో నటిస్తున్నారు.   

Latest News
 
19.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'గేమ్ ఛేంజర్' సెకండ్ సింగల్ Tue, Oct 01, 2024, 09:47 PM
ఆస్ట్రేలియాలో $800K మార్క్ ని చేరుకున్న 'దేవర' Tue, Oct 01, 2024, 09:44 PM
రొమాంటిక్ సీన్స్ లో నటించడం పై తమన్నా ఆసక్తికర కామెంట్స్ Tue, Oct 01, 2024, 07:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ సింగల్ Tue, Oct 01, 2024, 07:00 PM
'కాళీ' నుండి హలో హలో సాంగ్ అవుట్ Tue, Oct 01, 2024, 06:56 PM