UKలో 'దేవర' లేటెస్ట్ గ్రాస్ ఎంతంటే...!

by సూర్య | Tue, Oct 01, 2024, 06:22 PM

శివ కోరటాల దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ నటించిన యాక్షన్ డ్రామా "దేవర: పార్ట్ 1" సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో  ఒకటైన ఈ సిఎంమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాని UKలో డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ మరియు హంసిని ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేసాయి. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా UK మరియు ఐర్లాండ్‌లో అత్యద్భుతమైన £461,974 గ్రాస్ ని వాసులు చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ, ప్రేక్ష రాజ్, అజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న "దేవర: పార్ట్ 1" ఎపిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తుంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతాన్ని అందించారు.

Latest News
 
19.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'గేమ్ ఛేంజర్' సెకండ్ సింగల్ Tue, Oct 01, 2024, 09:47 PM
ఆస్ట్రేలియాలో $800K మార్క్ ని చేరుకున్న 'దేవర' Tue, Oct 01, 2024, 09:44 PM
రొమాంటిక్ సీన్స్ లో నటించడం పై తమన్నా ఆసక్తికర కామెంట్స్ Tue, Oct 01, 2024, 07:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ సింగల్ Tue, Oct 01, 2024, 07:00 PM
'కాళీ' నుండి హలో హలో సాంగ్ అవుట్ Tue, Oct 01, 2024, 06:56 PM