చరణ్‌, నిన్నెవరూ మ్యాచ్‌ చేయలేరంటూ గేమ్‌ఛేంజర్‌ పాటపై ప్రశంసలు కురిపించిన సమంత

by సూర్య | Tue, Oct 01, 2024, 04:24 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ లో మెగా ఫ్యాన్స్ మొత్తం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.ఆర్ఆర్ఆర్ లాంటి సంచలన హిట్ తర్వాత చరణ్ నటిస్తున్న కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గేమ్ ఛేంజర్ ఎప్పుడో మొదలైనప్పటికీ ఇప్పటివరకు ఫ్యాన్స్ కు సరైన అప్డేట్ అందించలేకపోయారు. దాంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు. శంకర్ భారతీయుడు 2 పనుల్లో బిజీ అవ్వడంతో ఈ షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు వరుసగా అప్డేట్స్ ఇస్తూ అభిమానులను అలరిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ నుంచి విడుదలైన పోస్టర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.


అలాగే గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే విడుదలైన జరగండి జరగండి సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కాగా ఇప్పుడు ఈ మూవీ నుంచి రెండో సాంగ్ ను రిలీజ్ చేశారు. రారా మచ్చ అనే సాంగ్స్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. అయితే ఈసాంగ్ లో చరణ్ డాన్స్ ఇరగదీశారు. అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ సాంగ్ కు థమన్ సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తోంది ఈ సాంగ్.


24 గంటలు కూడా గడవక ముందే ఈ సాంగ్ 16 మిలియన్ కు పైగా వ్యూస్ తెచ్చుకుంది. ఇక ఈ పాటపై మెగా అభిమానులతో పాటు సినీ సెలబ్రెటీలు కూడా రియాక్ట్ అవుతున్నారు. సాంగ్ విడుదల సందర్భంగా చరణ్ ఈ భారీ పాటను నేను ఆనందించినట్లు.. మీరూ ఆనందిస్తున్నారని ఆశిస్తున్నా అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీని ఆయన సతీమణి స్పందిస్తూ..మిస్టర్‌ సీ.. మీ డ్యాన్స్‌తో హై ఓల్టేజ్‌ పుట్టించారు అని రాసుకొచ్చారు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత గేమ్ ఛేంజర్ సాంగ్ పై స్పందించింది. అన్‌మ్యాచ్‌బుల్‌.. ఫార్మల్‌ ప్యాంట్‌, షర్ట్‌ ధరించి ఎవరు ఇలా డ్యాన్స్‌ చేయగలరు.. అంటూ రాసుకొచ్చింది

Latest News
 
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ సింగల్ Tue, Oct 01, 2024, 07:00 PM
'కాళీ' నుండి హలో హలో సాంగ్ అవుట్ Tue, Oct 01, 2024, 06:56 PM
స్టార్ క్రికెటర్‌తో అనన్య డేటింగ్... క్లారిటీ ఇచ్చిన నటి Tue, Oct 01, 2024, 06:52 PM
రజనీకాంత్‌కి సర్జరీ పూర్తి Tue, Oct 01, 2024, 06:39 PM
CBFC సూచించిన 13 కట్స్ కి అంగీకరించిన కంగనా రనౌత్ Tue, Oct 01, 2024, 06:31 PM