'మట్కా' సెట్స్ లో ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి బర్త్ డే సెలెబ్రేషన్స్

by సూర్య | Fri, Sep 27, 2024, 03:40 PM

కరుణ కుమార్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మట్కా' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ పాన్-ఇండియన్ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు నోరా ఫతేహి కథానాయికలగా నటిస్తున్నారు. 1958 నుండి 1982 వరకు 24 సంవత్సరాల పాటు సాగే కథ కారణంగా వరుణ్ తేజ్ మట్కాలో ఇప్పటి వరకు అత్యంత సవాలుగా ఉండే పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం వరుణ్ తేజ్ పాత్ర యొక్క యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు ప్రయాణాన్ని ప్రదర్శిస్తుంది. ఈ పీరియాడికల్ డ్రామా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ సినిమా హైదరాబాద్‌లోని రామానాయుడు ఫిల్మ్ సిటీ (RFC)లో చివరి షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా సెట్స్ లో ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సెలెబ్రటైన్స్ కి సంబందించిన పిక్స్ ని చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవిశంకర్ మరియు ఇతరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. టెక్నికల్ క్రూలో జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజర్, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్ గా ఉన్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై డా.విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు.

Latest News
 
'వెట్టయన్' తమిళనాడు థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Sep 27, 2024, 07:46 PM
'స్వాగ్' నుండి స్వాగ్ వార్ వీడియో రిలీజ్ Fri, Sep 27, 2024, 07:40 PM
USAలో $3M మార్క్ ని చేరుకున్న 'దేవర' ప్రీమియర్ గ్రాస్ Fri, Sep 27, 2024, 07:36 PM
50 రోజుల రన్ ని పూర్తి చేసుకున్న 'కమిటీ కుర్రోళ్లు' టీమ్ Fri, Sep 27, 2024, 07:30 PM
'తాండల్' లో శివుని పాట Fri, Sep 27, 2024, 07:23 PM