'దేవర' స్పెషల్ ఇంటర్వ్యూ విడుదలకి టైమ్ ఖరారు

by సూర్య | Wed, Sep 25, 2024, 02:44 PM

శివ కోరటాల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'దేవర' అనే టైటిల్ ని లాక్ చేసారు. 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో "దేవర: పార్ట్ 1" ఒకటి. ఈ సినిమా సాంగ్స్ మరియు ట్రైలర్ మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేసాయి. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్ లో భగంగా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ లో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ, రామ జోగయ్య శాస్త్రి, అనిరుద్, రత్నవేలు సినిమాకి సంబందించిన విషయాలని వెల్లడించారు. తాజాగా చిత్ర బృందం ఈ స్పెషల్ ఇనేటర్వ్యూ ని ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న "దేవర: పార్ట్ 1" ఎపిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తుంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

Latest News
 
గేమ్ ఛేంజర్ : ఈ తేదీన విడుదల కానున్న 'రా మచా మచా' సాంగ్ ప్రోమో Wed, Sep 25, 2024, 05:07 PM
ఆదిత్య మ్యూజిక్ లో అందుబాటులోకి వచ్చిన 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ సింగల్ Wed, Sep 25, 2024, 05:02 PM
ధృవ్ విక్రమ్‌తో అజయ్ భూపతి తదుపరి చిత్రం Wed, Sep 25, 2024, 04:42 PM
'స్వాగ్' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, Sep 25, 2024, 04:37 PM
ఫుకెట్‌లో శ్రియా శరణ్ పోజులు Wed, Sep 25, 2024, 04:32 PM