50 రోజుల కౌంట్డౌన్ లో రానున్న 'కంగువ'

by సూర్య | Wed, Sep 25, 2024, 02:03 PM

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య తన తదుపరి సినిమాని శివ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'కంగువ' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ యాక్షన్ డ్రామా గత జన్మల కాన్సెప్ట్‌తో రూపొందింది. ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా 50 రోజులలో థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో దిశా పాటని కథానాయికగా నటిస్తుంది. బాబీ డియోల్, యోగి బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం యొక్కబడ్జెట్ మూడు వందల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ మాగ్నమ్ ఓపస్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రొడక్షన్‌ హౌస్‌ స్టూడియో గ్రీన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Latest News
 
గేమ్ ఛేంజర్ : ఈ తేదీన విడుదల కానున్న 'రా మచా మచా' సాంగ్ ప్రోమో Wed, Sep 25, 2024, 05:07 PM
ఆదిత్య మ్యూజిక్ లో అందుబాటులోకి వచ్చిన 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ సింగల్ Wed, Sep 25, 2024, 05:02 PM
ధృవ్ విక్రమ్‌తో అజయ్ భూపతి తదుపరి చిత్రం Wed, Sep 25, 2024, 04:42 PM
'స్వాగ్' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, Sep 25, 2024, 04:37 PM
ఫుకెట్‌లో శ్రియా శరణ్ పోజులు Wed, Sep 25, 2024, 04:32 PM