ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' లో కీలకపాత్రలో జయపద్ర

by సూర్య | Mon, Sep 23, 2024, 07:08 PM

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ప్రభాస్ మళ్లీ స్పీడు పెంచాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మధురైలో జరుగుతుండగా, అలనాటి అందాలభామ జయప్రద కూడా సెట్స్ పై అడుగుపెట్టింది. ఈ షెడ్యూల్ లో జయప్రదపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మాధురైలో జరిగిన తొలి రోజు షూటింగ్ లో ప్రభాస్ తప్ప మిగతా తారాగణం మొత్తం పాల్గొన్న సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో ప్రభాస్ స్వాతంత్ర్య కాలం నాటి సైనికుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమాకు ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ హిస్టారికల్ డ్రామా చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. ఇమాన్వికి ఇదే తొలి చిత్రం. ఇటీవలే ఫౌజీ హైదరాబాదులో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. అటు, ప్రభాస్ ది రాజా సాబ్ చిత్రంలోనూ నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కూడా వేగంగా షూటింగ్ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ది రాజా సాబ్ చిత్రం హారర్ కామెడీ జానర్లో తెరకెక్కుతోంది.

Latest News
 
'దేవర' రిలీజ్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ Mon, Sep 23, 2024, 08:27 PM
వదిన గురించి నిహారిక ఏమన్నారంటే.. Mon, Sep 23, 2024, 07:56 PM
శ్రద్ధా దాస్ గ్లామర్ షో Mon, Sep 23, 2024, 07:45 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వెట్టయన్' ప్రివ్యూ Mon, Sep 23, 2024, 07:37 PM
'జనక అయితే గనక' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ Mon, Sep 23, 2024, 07:34 PM