10M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'దేవర' రిలీజ్ ట్రైలర్

by సూర్య | Mon, Sep 23, 2024, 05:16 PM

శివ కోరటాల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'దేవర' అనే టైటిల్ ని లాక్ చేసారు. 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో "దేవర: పార్ట్ 1" ఒకటి. ఈ సినిమా సాంగ్స్ మరియు ట్రైలర్ మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేసాయి. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ యూట్యూబ్ లో 10 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న "దేవర: పార్ట్ 1" ఎపిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తుంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

Latest News
 
'దేవర' రిలీజ్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ Mon, Sep 23, 2024, 08:27 PM
వదిన గురించి నిహారిక ఏమన్నారంటే.. Mon, Sep 23, 2024, 07:56 PM
శ్రద్ధా దాస్ గ్లామర్ షో Mon, Sep 23, 2024, 07:45 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వెట్టయన్' ప్రివ్యూ Mon, Sep 23, 2024, 07:37 PM
'జనక అయితే గనక' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ Mon, Sep 23, 2024, 07:34 PM