'లగ్గం' విడుదలకి తేదీ లాక్

by సూర్య | Sat, Sep 21, 2024, 03:19 PM

సుబిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వేణు గోపాల్ రెడ్డి నిర్మించిన భారీ అంచనాల చిత్రం "లగ్గం" కి రమేష్ చెప్పాల రచించి, దర్శకత్వం వహించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న 'లగ్గం' పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని లాక్ చేసారు. ఈ చిత్రం అక్టోబర్ 18న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో సాయి రోనక్ మరియు ప్రజ్ఞా నగ్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రాచ రవి, కనకవ్వ, వడ్లమాని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చంద్ర, చిత్రమ్ శీను, సంధ్యా గంధం, టి.సుగుణ, లక్ష్మణ్ మీసాల, ప్రభావతి, కంచెరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను, సత్య ఏలేశ్వరం, అంజి బాబు, ఆర్ ఎస్ నంద, కిరీటి ఈ చిత్రంలో కీలక పత్రాలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందించారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్, బాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్, కృష్ణ ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు.

Latest News
 
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు 31 నగరాల్లో జరగనున్నాయి - నాగార్జున Sat, Sep 21, 2024, 04:08 PM
'సరిపోదా శనివారం' నుండి ఉల్లాసం వీడియో సాంగ్ రిలీజ్ Sat, Sep 21, 2024, 04:04 PM
సుధీర్ బాబు 'జటాధార'లో ప్రముఖ బాలీవుడ్ నటి Sat, Sep 21, 2024, 03:58 PM
'దేవర' నుండి రెండవ ట్రైలర్ విడుదల కానుందా? Sat, Sep 21, 2024, 03:52 PM
యూట్యూబ్ మ్యూజిక్ ట్రేండింగ్ లో 'మా నాన్న సూపర్ హీరో' ఫస్ట్ సింగల్ Sat, Sep 21, 2024, 03:47 PM