బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఆర్సీ16కి కమిట్ అయిన రామ్ చరణ్

by సూర్య | Mon, Sep 16, 2024, 08:48 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి రామ్ చరణ్ షూటింగ్ పార్ట్ పూర్తయింది. ఈ సినిమా డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. గేమ్ చేంజర్ రామ్ చరణ్ కు 15వ చిత్రం కాగా, 16వ సినిమా కూడా ఖరారైంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటించనున్నారు. తాజాగా, ఈ సినిమా (ఆర్సీ16) కోసం రామ్ చరణ్ అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టేశారు. చిత్రబృందం ఈ మేరకు రామ్ చరణ్ బ్యాక్ లుక్ తో ఓ ఫొటో రిలీజ్ చేసింది. తన పాత్ర కోసం రామ్ చరణ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు అంటూ సుకుమార్ రైటింగ్స్ చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పేర్కొంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభవుతుందని వెల్లడించింది. 'ఆర్సీ16' ఓ మెగా మాసివ్ మూవీ అంటూ చరణ్ ఫ్యాన్స్ కు క్రేజీ కబురు చెప్పింది. కాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ క్రీడాకారుడిగా కనిపించనున్నట్టు తెలుస్తోంది.

Latest News
 
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM
'సింగం ఎగైన్' లో బాలీవుడ్ సూపర్‌స్టార్ Thu, Sep 19, 2024, 07:19 PM