'కంగువ' ఫస్ట్ సింగల్ కి భారీ రెస్పాన్స్

by సూర్య | Fri, Jul 26, 2024, 04:30 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి సినిమాని దర్శకుడు సిరుత్తై శివతో అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు 'కంగువ' అనే టైటిల్‌ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దిశా పటానీ సూర్య సరసన జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో యోగి బాబు, సంజయ్ దత్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 10, 2024న విడుదల కానుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్‌ను ఫైర్ సాంగ్ అనే టైటిల్ తో విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ లో అన్ని భాషలలో 20 మిలియన్ వ్యూస్ తో ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త వీడియోని విడుదల చేసింది. ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌కి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్లపై వంశీకృష్ణ, ప్రమోద్, కెఇ జ్ఞానవేల్రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM