'బడ్డీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే...!

by సూర్య | Fri, Jul 26, 2024, 03:22 PM

సామ్ ఆంటోన్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'బడ్డీ' అనే టైటిల్‌ ని లాక్ చేసారు. ఈ చిత్రం ఆగష్టు 2న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రేపు సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. స్టూడియో గ్రీన్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఇ జ్ఞానవేల్రాజా, ఆధాన జ్ఞానవేల్రాజా బడ్డీని నిర్మిస్తున్నారు. అజ్మల్ అమీర్, ప్రిషా రాజేష్ సింగ్, ముఖేష్ కుమార్, మహమ్మద్ అలీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హిప్ హాప్ తమిజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM